Begin typing your search above and press return to search.
'లవ్ డ్రగ్' అంటూ పూరి నోట పెను సంచలనం
By: Tupaki Desk | 22 Dec 2022 9:38 AM GMTలైట్ తీస్కోవడం .. లైటర్ వెయిన్ లైఫ్ ని లీడ్ చేయడం ఎలానో పూరీనే అడగాలి. జీవితంలో ఎన్నో ఉత్థానపతనాల్ని చవి చూసిన పూరి ఫిలాసఫీ ఏ ఇతర మానవునితో పోల్చినా వైవిధ్యంగా ఉంటుంది. పూరి ఏం మాట్లాడినా అందులో ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది. అందుకే అతడు రాసే డైలాగులు థియేటర్లలో ఒక రేంజులో పేల్తుంటాయి. అతడి ప్రతి రాతలో ప్రతి మాటలో కసి పంతం పట్టుదల కనిపిస్తాయి. శత్రుసమాజానికి సైలెంటుగానే చురకలు అంటించేస్తుంటాడు. ఇక మీడియా జర్నలిజంపై అయితే నేరుగా తన సినిమాల్లోనే ఎటాక్ లు చేసాడు.
ఏది ఏమైనా ఇప్పుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో పటాసులు పేలుస్తున్నాడు. లైగర్ ఫ్లాపైందన్న దిగులు కానీ లేదా ఎన్.సి.బి- ఈడీలు తనని పిలిచి విచారించాయన్న ఆందోళన కానీ ఎక్కడా పూరీలో కనిపించలేదు సరికదా.. లైఫ్ ఫిలాసఫీ ఇదిగో అంటూ అతడు తనదైన పంథాలో యూత్ కి నూరి పోస్తున్నాడు.
వివాదాలు పరమ రొటీన్.. భయపడటం పక్కా బోరింగ్! అన్న తీరు అతడిలో కనిపిస్తోంది. ఇటీవల అతడు తన అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తనకు నచ్చేవి తాను మెచ్చేవి.. ప్రాక్టికల్ జీవితంలో తన అనుభవాలను పూరి మ్యూజింగ్స్ పేరుతో ఛమక్కుల్లా విసురుతున్నాడు. తాజాగా ''లవ్ డ్రగ్'' పేరుతో పూరి రిలీజ్ చేసిన వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
#LOVE DRUG సారాంశం ఇలా ఉంది. ''లవ్ అనేది ఒక డ్రగ్. అందులో నీతి- నిజాయితీ- ప్రేమ- తొక్కా- తోటకూర ఏమీ లేవ్. నా లవరు ఘాఢంగా ప్రేమించేన్నాడు. నా లవర్ నన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకోవడమే తప్ప అందులో నిజం లేదు. ఆ ఫీలింగ్ అంతా ఒక కెమికల్ రియాక్షన్'' అని అన్నాడు. అంతేకాదు దీనికి ఆధారాలను బయటపెట్టాడు. డాక్టర్ హెలెన్ ఫిషర్ అని ఒక ఆమె.. ప్రేమ గురించి అధ్యయనం చేసి కొన్ని పుస్తకాలు రాసింది. అతడే ఎందుకు..? ఆమే ఎందుకు..? అనే టైటిల్ తో ప్రేమ ఎంత గొప్పదో పరిశోధించారు. 2500 మంది స్టూడెంట్స్ బ్రెయిన్ ను ఆమె స్కాన్ చేసి చివరికి 'ప్రేమ లేదు దోమ లేదు.. ఇదంతా కెమికల్స్ మాయ!!' అని తేల్చి చెప్పింది. లవ్ కూడా ఒక డ్రగ్ అని తేలింది. ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్ అన్నీ రిలీజవుతాయి. ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకొక ముద్దు.. ముద్దు మీద ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అదంతా కెమికల్ మాయ.. మీ ప్రేమ కాదు'' అని పూరి క్లాస్ తీస్కున్నారు.
లవ్ డ్రగ్ గురించి మరింత డీటెయిల్డ్ గా అభివర్ణించారు పూరి. లవ్ డ్రగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాంటి ప్రామిస్ లు చేయొద్దు. లవర్ కోసం పేరెంట్స్ ను వదిలి వెళ్లిపోవడాలు... ప్రాణాలు ఇచ్చేస్తాం అనడాలు చేయకండి. అందుకే మీ లవర్ కు ప్రామిస్ చేసేముందు రెండు సార్లు స్వయంతృప్తి పొందేలా హస్త**గం చేసుకోండి. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. ఆ పని చేసిన తరువాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు కెమికల్స్ చల్లబడతాయి.. మీరు కామ్ అవుతారు. నిర్ణయాలు బాగా కుదురుతాయి. మీ జీవితాలు బాగుపడతాయి.. అంటూ మరింత డీటెయిలింగ్ కూడా ఇచ్చారు పూరి.
పాతికేళ్ల వయసు వస్తే ఎంతో కొంత బుద్ధి జ్ఞానం వస్తాయి. పాతికేళ్ల లోపు పిల్లలకు అసలు బుద్ధి కూడా ఉండదు. ఓపక్క కెమికల్స్ మోసం చేస్తాయి. అలాంటి సమయంలోనే ఏదొక లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది.. వెంటనే తాళి కట్టేస్తారు. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది జోక్ కాదు.. నిజం.. దయచేసి తప్పులు చేయొద్దు అని పూరి ప్రాక్టికాలిటీని నిష్కర్షగా వర్ణించి చెప్పాడు. అమ్మాయిలు అబ్బాయిలూ పూరి సలహా వింటున్నారా?
లైగర్ డిజాస్టర్ అయ్యాక పూరి ఇప్పుడు సల్మాన్ భాయ్ కి కథలు వినిపించే పనిలో ఉన్నాడని మరోవైపు గుసగుస వినిపిస్తోంది. ఇప్పట్లో టాలీవుడ్ హీరోల జోలికి వచ్చే ఛాన్స్ లేదని .. అతడు తన పంతాన్ని బాలీవుడ్ లోనే నెరవేర్చుకునేందుకు కసిగా పని చేస్తున్నాడని ఇన్ సైడ్ సోర్స్ రివీల్ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.