Begin typing your search above and press return to search.

మాన‌వ‌జాతి ఈ భూమికి ప‌ట్టిన ఓ వైర‌స్- పూరి

By:  Tupaki Desk   |   1 April 2020 3:45 AM GMT
మాన‌వ‌జాతి ఈ భూమికి ప‌ట్టిన ఓ వైర‌స్- పూరి
X
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ లో సైతం అప్పుడ‌ప్పుడు గురువు రాంగోపాల్ వ‌ర్మ‌లా వితండ వాదం క‌నిపిస్తుంటుంది. వ‌ర్మ‌లా స్ట్రెయిట్ ఫార్వార్డ్ కాక‌పోయినా సంఘంలో ర‌క‌ర‌కాల దుర్మార్గాలపై త‌న‌కు ఉన్న క‌క్ష‌ను సినిమాల ద్వారా చెప్పే ప్ర‌యత్నం చేస్తుంటాడు. బిజినెస్ మేన్ లో మ‌నిషి దుర్మార్గ‌పు క్యారెక్ట‌ర్ పై డిస్క‌వ‌రీ చానెల్ సీన్ తో లింకు పెట్టి మ‌రీ చీవాట్లు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు ఓ డైలాగ్ లో.. మ‌నిషి ఎంత హానిక‌ర‌మో ఒకే ఒక్క‌ డైలాగ్ లో చెప్పాడు పూరి. దాన్ని ఫిలాస‌ఫీ అనాలా? లేక వితండ వాదం అనాలా? అన్న‌ది సెకెండ‌రీ. తాజాగా ప్ర‌పంచాన్ని కొవిడ్-19 గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న నేప‌థ్యంలో మ‌రోసారి పూరి మ‌రోసారి మాన‌వ జాతిపై త‌న కోపాన్ని బ‌య‌టికే వెల్ల‌గ‌క్కాడు.

ప్ర‌కృతిని మాన‌వుడు ఎప్ప‌టికీ అర్ధం చేసుకోడు. అందుకే అదే అంద‌రిని స‌ర్ధేసుకుంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. భూమి పై జ‌రిగే ప్ర‌తి విప‌త్తుకు మాన‌వుడే కార‌ణం. అస‌లు ప్ర‌కృతి ముందు మ‌న‌మెంత‌? దాని దృష్టిలో మాన‌వ‌జాతి ఈ భూమికి ప‌ట్టిన ఓ వైర‌స్. అన్ని దేశాలు జ‌నాభాను నియంత్రించాలి అని నాలుగు మంచి మాట‌లు చెబుతూనే... త‌ర్వాత త‌రం వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవ‌డం మానేయాల‌ని చాలా గ‌ట్టిగా చెప్పాడు. పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసి పిల్ల‌ల్ని క‌నుకుంటూ వెళ్లిపోతే అన్ని జంతువులు అంత‌రించి పోయి భూమ్మీద మ‌నుషులే మిగులుతారు. త‌ర్వాత వాళ్లే జంతువులుగా మార‌తారేమో అనిపిస్తోంది... అంటూ చాలా సీరియ‌స్ గానే క్లాస్ తీస్కున్నాడు.

అయితే పూరి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై కొంత మంది నెటి జ‌నులు అంతెత్తున లేచి ప‌డుతున్నారు. ఆ క్రియేటర్ కొన్ని మంచి విష‌యాలు చెప్పినా...జీర్ణించుకోలేని మ‌రో సంగ‌తిని ట‌చ్ చేయ‌డం న‌చ్చ‌లేదెవ‌రికీ. అస‌లు మ‌నిషి పెళ్లి చేసుకోక‌పోతే? ఎలా అంటూ పూరి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. ఈ త‌రంలో మీరంతా పెళ్లిళ్లు చేసుకుని అన్ని సుఖాలు చూసేసారు. త‌ర్వాతి త‌రానికి ఆ ఎజాయ్ మెంట్ వ‌ద్దా? నెక్స్ట్ జ‌న‌రేష‌న్ పెళ్లి చేసుకుని కాపురాలు చేయడం ఇష్టం లేదా? అంటూ పూరి వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్లు వేస్తున్నారు.