Begin typing your search above and press return to search.
పూరి కంప్లీట్ ఛేంజ్..అంతా క్లీన్ గా!
By: Tupaki Desk | 24 Aug 2022 10:30 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `లైగర్` కి ముందు..తర్వాత అని కచ్చితంగా అనిపించుకుంటానని ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. లైగర్ నుంచి తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతందంటున్నారు. వేగంగా చేసినంత కాలం సినిమాలు చేసాను..ఇంకా ఆ వేగం ఎందుకు? కొత్తవాడిని కాదు..ఇకపై చేసే ఏ సినిమాకైనా ఎక్కువ రోజులు కేటాయించి పనిచేస్తాంటున్నారు.
కథ రాయడం దగ్గరం నుంచి దాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. తనలో వచ్చిన ఆ మార్పు గురించి ఇండస్ర్టీ సహా ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో ఆ మార్పుసను ఇంకా ఎక్కువగా కనిపిస్తుందని..ఇది రాసిపెట్టుకునే విషయంగా చెప్పుకొచ్చారు.
మరి పూరిలో ఈ మార్పు సినిమాలపరంగానేనా? వ్యక్తిగతంగానూ ఆయన మార్పులొచ్చాయా? అంటే ఆరకంగానూ అవుననే అంటున్నారు. అవును పూరిలో ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు పూరి వేరు. ఇకపై పూరి వేరు. సాధారణంగా టాలీవుడ్ డైరెక్టర్లు అంటే చాలా సింపుల్ గా ఉంటారు. తమ హీరోల్ని స్టైల్ గా చూపిస్తారు తప్ప తాము అంతే స్టైల్ గా ఉండటానికి ఇష్టపడరు.
కానీ పూరి వేరు. హీరోలతో పాటు తాను ఎంతో స్టైలిష్ గా ఉండటానికి ట్రై చేస్తుంటారు. ఒకప్పుడు పూరిలో ఎంతో స్టైలింగ్ కనిపించేది. శరీరమంతా టాటూలు..నెత్తికి డిఫరెంట్ హ్యాట్స్ ..ముఖానికి మాస్క్ లు ధరించి కనిపించేవారు. బ్లాక్ టీషర్టులు..ట్రాక్ లు ధరించే వారు. కానీ లైగర్ ప్రచారంలో అదెక్కడా కనిపించలేదు. క్యాజువల్ ప్యాంట్.. షర్ట్ లో కనిపించారు.
చేతుల మీదెక్కడా టాటూలు లేవు. బ్రాండెడ్ షూస్ బధులుగా సాధారణ చెప్పులు ధరించారు. హెయిర్ క్రాప్ చేసుకుని చక్కగా సైడ్ పాపిడి దువ్వి అమాయక చక్రవర్తిలో ముస్తాబయ్యాడు. మరి ఈ మార్పు శాశ్వతమా? తాత్కలికమా? అన్నది తెలియదు గానీ ప్రస్తుతానికి పూరి చాలా కొత్త గా కనిపిస్తున్నాడు. స్టైలింగ్ విషయం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా పూరి చాలా ఓపెన్ మైండెడ్.
విషయం ఏదైనా..ఎలాంటిదైనా చాలా ఓపెన్ గా మాట్లాడుతారు. అతని వద్ద కొత్తవాళ్లు..పాత వాళ్లు అనేది ఉండదు. అంతా తెలిసిన వాళ్లలా కలిసిపోయి మాట్లాడుతారు. ఇలాంటి రేర్ క్వాలిటీస్ ఎన్నో పూరిలో ఉన్నాయి. ఆయన ముసుగు మయుఖానికి వేసుకుంటాడు తప్ప మనసుకు కాదు. అందుకే పూరిని స్టార్ హీరోలు..దర్శక-నిర్మాతలు అంతగా అభిమానిస్తారు..ఇష్టపడ తారు. ఈ విషయంలో పూరి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన ఛేంజ్ అంటూ ఏమీ లేదు. అది ఒక్క పూరికి మాత్రమే సాధ్యం.