Begin typing your search above and press return to search.
పూరీకి విగ్రహం పెట్టేశారుగా!!
By: Tupaki Desk | 1 May 2017 5:38 AM GMTఈ తరం స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాధ్ కు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పడు ఫ్లాపులతో వెనకబడ్డాడు కానీ.. పూరీకి ఇండస్ట్రీలో కూడా అనేకమంది ఫ్యాన్స్ ఉంటారు. 'నేను ఓ పెద్ద సీన్ లో చెప్పగలిగే భావాన్ని.. పూరీ కేవలం సింగిల్ డైలాగ్ లో చెప్పగలడు' అని రాజమౌళి లాంటి డైరెక్టర్ అన్నాడంటే పూరీ స్థాయి అర్ధమవుతుంది.
అలాంటి ఈ దర్శకుడికి ఇప్పుడు ఓ వీరాభిమాని విగ్రహం పెట్టేశాడు. తెలంగాణలోని కరీనంగర్ జిల్లాలో ఉన్న కొండాపూర్ గ్రామంలో ఈ విగ్రహం ఏర్పాటైంది. ప్రభాకర్ అనే వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చిన్నప్పటి నుంచి పూరి జగన్నాధ్ కు వీరాభిమాని అయిన ప్రభాకర్.. తన ఊళ్లోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పూరీ సినిమాలపై ఇతనికి విపరీతమైన ప్రేమ ఉంటుందని.. పూరీ తీసిన ప్రతీ సినిమాను అనేక మార్లు చూస్తూ ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు.
అంతే కాదు.. ఈ విగ్రహావిష్కకరణను పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ చేతుల మీదుగానే చేయించడం విశేషం. తండ్రి విగ్రహాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయిన ఆకాష్.. తన తండ్రిపై ప్రభాకర్ చూపిస్తున్న ప్రేమను చూసి షాక్ తినేశాడు. అయితే.. తండ్రికి ఇంతటి అభిమాని ఉండడం చూసి ఎంతో సంతోషించిన ఈ కుర్రాడు.. ఇకపై ప్రభాకర్ ను తనకు సలహాదారుడిగా భావిస్తానని చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/