Begin typing your search above and press return to search.

రొమాంటిక్‌ లో మరింత రొమాన్స్‌ చేర్చే ప్రయత్నంలో పూరి

By:  Tupaki Desk   |   13 April 2020 4:30 PM GMT
రొమాంటిక్‌ లో మరింత రొమాన్స్‌ చేర్చే ప్రయత్నంలో పూరి
X
బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆకాష్‌ పూరి మెహబూబా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతో తన కొడుక్కు సూపర్‌ హిట్‌ ఇవ్వాలనుకున్న పూరి నిరాశ పర్చాడు. మెహబూబా చిత్రం నిరాశ పర్చడంతో ఆకాష్‌ కాస్త గ్యాప్‌ ఇచ్చి ప్రస్తుతం రొమాంటిక్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి నిర్మిస్తుండగా అనిల్‌ పదురి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రొమాంటిక్‌ టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

బ్యాలన్స్‌ వర్క్‌ పూర్తి చేసి సమ్మర్‌ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కాని లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. తాజాగా పూరి రొమాంటిక్‌ సినిమా రషెష్‌ ను చూశాడట. అందులోని రొమాంటిక్‌ సన్నివేశాల విషయంలో పూరి నిరుత్సాహం వ్యక్తం చేశాడని కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ ను ఇంకాస్త బెటర్‌ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో రీ షూట్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. తానే నిర్మాత అవ్వడం వల్ల ఆ రొమాంటిక్‌ సీన్స్‌ ను తానే పూర్తి చేయాలని కూడా పూరి అనుకుంటున్నాడు.

ఆకాష్‌ పూరికి జోడీగా ఈ చిత్రంలో కెతికా శర్మ నటిస్తున్న విషయం తెల్సిందే. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం లెక్క చేయకుండా పూరి కొడుకు కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను ఈ కరోనా ఎఫెక్ట్‌ పూర్తి అయిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.