Begin typing your search above and press return to search.

మా ఆవిడ టార్చర్‌ పెడుతోంది -పూరి

By:  Tupaki Desk   |   25 May 2015 9:00 PM IST
మా ఆవిడ టార్చర్‌ పెడుతోంది -పూరి
X
కొందరికి పెళ్లాల టార్చర్‌. ఆ జాబితాలోనే పూరి పేరు కూడా చేరింది. అవును.. టాలీవుడ్‌ని తనదైన స్పీడ్‌తో అల్లాడిస్తున్న స్పీడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కి ఇంట్లో పెళ్లాం పోరు తప్పడం లేదుట. ఈ విషయాన్ని అతడే స్వయంగా విన్నవించాడు. ఇటీవలే నాగబాబు తనయురాలు నీహారిక బుల్లితెర షోలో పూరీ ఈ విషయాల్ని చెప్పాడు.

ఇంట్లోనే ఉండి స్క్రిప్టులు రాసుకోవచ్చు గదా! ప్రతిసారీ బ్యాంకాక్‌ ఎందుకు వెళతారు? అన్న ప్రశ్నకు.. అబ్బే ఇంట్లో మా ఆవిడ టార్చర్‌ పెట్టేస్తోంది. సినిమా సంగతులు కానీ, స్క్రిప్టుల డిస్కషన్స్‌ కానీ ఇంట్లో అంటే ఊరుకోదు. సినిమా విషయాలు తప్ప ఇంకేవైనా మాట్లాడాలి అన్నది కండిషన్‌. అందుకే బ్యాంకాక్‌ వెళ్లిపోయి బీచ్‌లో కూచుని రాసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లలో ఇంట్లోనే కూచుని స్క్రిప్టులు ఎప్పుడూ రాసుకోలేదని చెప్పాడు.

నిజమే.. నిత్యం సినిమా గోల భరించడం ఏ పెళ్లానికైనా కష్టమే. బుర్ర పిండుకుని రాస్తే కానీ స్క్రిప్టు పూర్తవ్వదు. దానికి పది మందితో డిస్కషన్లు ప్లస్‌ ఇంకా చాలా కావాలి. కాబట్టి ఇంట్లో ఇవన్నీ ఎక్కడ కుదురుతాయ్‌? అందుకే పూరీకి ఈ టార్చర్‌ అన్నమాట!