Begin typing your search above and press return to search.

పూరి కొడుకు.. ఆఫీస్ బాయ్

By:  Tupaki Desk   |   29 March 2017 9:34 AM GMT
పూరి కొడుకు.. ఆఫీస్ బాయ్
X
ఒక స్టార్ డైరెక్టర్ కొడుకు ఆయన తీస్తున్న సినిమా సెట్లో కాఫీలు.. టీలు అందిస్తూ బాయ్ గా పని చేయడ ఎక్కడైనా చూశారా..? పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ పూరితో అలాంటి పనులే చేశాడట. పూరి డైరెక్ట్ చేసిన ‘రోగ్’ సినిమాకు ఆకాశ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఐతే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కేవలం దానికి సంబంధించిన బాధ్యతలతో సరిపెట్టకుండా అతడితో బాయ్ చేసే పనులన్నీ చేయించినట్లు పూరి తెలిపాడు. ‘‘ఆకాశ్ చిన్నప్పట్నుంచి నా సినిమాల షూటింగ్ లో ఏదో ఒక పని చేస్తున్నాడు. ‘రోగ్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికంటే ముందు వాడికి బాయ్ పోస్ట్ ఇచ్చాను. అతిథులకు ఏం కావాలో? వాళ్ల దగ్గరకు వెళ్లి తెలుసుకుని కాఫీలు, టీలు ఇవ్వాలి. ఆ పని బాగానే చేశాడు. ఆ తర్వాతే అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు’’ అని పూరి తెలిపాడు.

ఇంతకీ ఆకాశ్ ఎప్పుడు హీరో అవుతాడు.. ఇందుకోసం ఎలా సన్నద్ధమవుతున్నాడు అని పూరిని అడిగితే.. ‘‘వాడిని త్వరలోనే హీరోను చేస్తా. అందుకోసం ప్రిపేరవుతున్నాడు. ‘రోగ్’ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేయడం కూడా ప్రిపరేషనే. హీరోగా వాడి తొలి సినిమా నేనే తీయాలి. ఇంకో ఏడాదిలో ఆ సినిమా ఉండొచ్చనుకుంటున్నా. కెరీర్‌ గురించి వాడికేం ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు. ఒక తండ్రిగా నాకైతే వాడితో ఓ మంచి సినిమా తియ్యాలని.. బాగా ఖర్చుపెట్టి వాడిని ప్రమోట్‌ చెయ్యాలని ఉంటుంది. లాంగ్‌ కెరీర్‌ ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ అది మన చేతుల్లో ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరైనా కష్టపడాల్సిందే. నేను డైరెక్టర్‌ ని కాబట్టి వాడితో నేను సినిమాలు తీయొచ్చు. కానీ వాడు జనాలకు నచ్చుతాడా.. లేదా అనేది మన చేతుల్లో ఉండదు’’ అని పూరి అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/