Begin typing your search above and press return to search.

నెక్స్ట్ సినిమా అలానే ఉంటుందట

By:  Tupaki Desk   |   3 July 2018 5:30 PM GMT
నెక్స్ట్ సినిమా అలానే ఉంటుందట
X
టాలీవుడ్ లో ఒకప్పుడు బడా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందొ అందరికి తెలిసిందే. వరుసగా పరాజయాలతో ఈ దర్శకుడు సతమతమవుతున్నాడు. గతంలో చేసిన సినిమాలు ఎదో ఒక విధంగా ఆకట్టుకునేవి. కానీ ఇప్పుడు ఏ విధంగానూ హిట్టు కొట్టలేకపోతున్నాడు. చివరగా కొడుకుతో చేసిన ఒక లవ్ డ్రామా కూడా బెడిసికొట్టింది. మెహబూబా సినిమా హిట్ అవుతుందని ముందులాగా ఈ దర్శకుడు చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

కానీ ఊహించని విధంగా ఫెయిల్ అయ్యింది. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఈ దర్శకుడు నెక్స్ట్ తన కొడుకు ఆకాష్ తోనే ఒక సినిమా చేస్తాను అని చెప్పాడు. అప్పట్లో కొందరి హీరోలతో సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ ఎవ్వరు పూరితో చేయడానికి ఇష్టపడటం లేదు. ఇక ముందుగా చెప్పిన దాని ప్రకారం ఆకాష్ తోనే సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే కథ కూడా పూర్తిగా సెట్ అయినట్లు తెలుస్తోంది.

ఆ సినిమా పూర్తిగా యాక్షన్ మరియు ఎంటర్టైనర్ తెరకెక్కనుందట. యాక్షన్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయేలా ఉంటాయని తన గత సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎలాగైతే ఉండేదో అలాగే రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను తొందరగా స్టార్ట్ చేసి ఫినిష్ చెయ్యాలని దర్శకుడు పూరి ఆలోచిస్తున్నాడు. మరి నెక్స్ట్ మాస్ కథతో కొడుకు కెరీర్ ను సెట్ చేస్తాడో లేదో చూడాలి.