Begin typing your search above and press return to search.
రాజమౌళి బ్యాచ్ కి హిట్టు కావాలి
By: Tupaki Desk | 14 April 2017 4:16 AM GMTరాజమౌళి బ్యాచ్ అంటే.. రాజమౌళి అండ్ కీరవాణి.. అండ్ విజయేంద్ర ప్రసాద్.. శ్రీవల్లి.. రమా.. కార్తికేయ.. ఇలా అనుకునేరు. కాదండోయ్. అస్సలు కాదు. రాజమౌళితో పాటే అదే టైములో తెరంగేట్రం చేసిన ఆయన సమకాలికులు కొందరు దర్శకులు ఉన్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ గురించే బయట తెగ చర్చలు జరుగుతున్నాయి.
రాజమౌళి స్టూడెంట్ నెం.1 సినిమాతో దూసుకొచ్చే సమయానికే.. ఇటు పూరి జగన్ అటు శ్రీను వైట్ల దర్శకులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలసి స్టార్ డైరక్టర్లుగా ఎదిగారు. కాకపోతే రాజమౌళి ఇప్పటికీ హిట్టు సినిమాలతో దూసుకుపోతుంటే.. పూరి అండ్ వైట్ల మాత్రం కాస్త తడబడుతున్నారు. రోగ్ వంటి సినిమాలను తీస్తూ తన క్రేజ్ తానే పాడుచేసుకుంటున్నాడు పూరి జగన్. ఇక వైట్ల కూడా తక్కువేం కాదు. ఆగడు అండ్ బ్రూస్ లీ దెబ్బతో అందరూ బెంబేలెత్తిపోయారు. ఇవాళ మనోడు ''మిష్టర్'' సినిమాతో వస్తున్నాడు కాబట్టి.. ఈ ప్రాజెక్టుతో హిట్టు కొడితే.. రాజమౌళి అండ్ కో అంతా సంతోషిస్తుంది.
అలాగే త్వరలో బాలయ్యతో కలసి పూరి కూడా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటే.. నూతన మిలీనియంలో వచ్చిన స్టార్ డైరక్టర్లందరూ.. బాగా గాట్టిగా కొట్టినవారే అవుతారు. ఇదే బ్యాచ్ లో వినాయక్ అండ్ త్రివిక్రమ్ ను కూడా కలుపుకోవచ్చు కాని.. వారు మాత్రం ఓ మాదిరి హిట్లతోనే బండిని లాగిస్తున్నారులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/