Begin typing your search above and press return to search.
పూరి విషయంలో ఇంత అతి అవసరమా?
By: Tupaki Desk | 19 July 2017 7:16 AM GMTగత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంతకుముందు కూడా టాలీవుడ్ సెలబ్రెటీలపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కొందరు పోలీసులకు దొరికారు. కానీ ఈసారి పోలీసుల నోటీసులందుకున్న వాళ్లు మామూలోళ్లు కాదు. వాళ్ల పేర్లన్నీ బయటికి రావడం.. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులివ్వడం.. సంచలనం రేపింది. 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీల్ని విచారించడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎవరు ఏ తేదీల్లో విచారణకు రావాలో కూడా స్పష్టత ఇచ్చారు. దాని గురించి మీడియాకు సమాచారం అందించారు.
ముందుగా ఈ రోజు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ కోసం అబ్కారీ కార్యాలయానికి వచ్చాడు. బుధవారం ఉదయం తన కొడుకు ఆకాష్.. తమ్ముడు సాయిరామ్ శంకర్ లను వెంటబెట్టుకుని కూడా పూరి అబ్కారీ కార్యాలయానికి చేరుకోవడం విశేషం. పూరి తర్వాత... రవితేజ.. సుబ్బరాజు.. ముమైత్ ఖాన్.. ఛార్మి.. ఇలా ఒక్కొక్కరుగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. విశేషం ఏంటంటే.. ఈ రోజు విచారణలో పూరిని ఏయే ప్రశ్నలు అడుగుతారన్నది కూడా మీడియాకు తెలిసిపోయింది. తాము పూరిని అడగబోయే ప్రశ్నలేంటో మీడియాకు విడుదల చేశారు పోలీసులు. ఆ ప్రశ్నలేవంటే..
* కెల్విన్ ఎలా పరిచయం అయ్యారు?
* పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట.. ఎందుకు?
* కెల్విన్.. జీషన్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు?
* ఎంతకాలంగా రోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు?
* నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు?
* కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు?
* కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు.. ఎలా సరఫరా చేసేవారు?
* ఛార్మి.. ముమైత్ ఖాన్.. రవితేజ.. సుబ్బరాజులకు డ్రగ్స్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా?
* డ్రగ్స్ తీసుకున్నాక కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్ లో ఉండరు?
* రక్త పరీక్షకు సిద్ధమా.. మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానమేంటి?
ఐతే ఈ ప్రశ్నలన్నీ బాగానే ఉన్నాయి కానీ.. విచారణలో పూరిని అడగబోయే ప్రశ్నలు ఇవీ అంటూ ముందే మీడియాకు పోలీసులు సమాచారం ఇవ్వడమే విడ్డూరంగా అనిపిస్తోంది. పారదర్శకత పాటించాలంటే ఇలా ప్రశ్నల గురించి సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి బయటకు రావాల్సిన మరిన్ని బయటపెడితే.. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేసి.. దోషులకు శిక్ష పడేలా చూస్తే అప్పుడు పారదర్శకత ఉందని భావిస్తారు కానీ.. ఇలా విచారణలో అడగబోయే ప్రశ్నల్ని ముందే లీక్ చేయడం లాంటివి అంత మంచి అభిప్రాయమైతే కలిగించవు.