Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ స్టోరీ వెనక ఆ డైరెక్టర్??
By: Tupaki Desk | 7 Feb 2017 4:26 AM GMTతెలుగు ప్రజల అన్నగారు నందమూరి తారకరామారావుపై బయోపిక్ చేస్తున్నానంటూ.. నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను తానే పోషించబోతున్నానంటూ చెప్పిన బాలయ్య.. ఈమూవీ కథపై ఇప్పటికే వర్క్ జరుగుతోందని కూడా చెప్పారు. అయితే.. దర్శకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో పెడతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
అయితే.. అసలు ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన బాలయ్యది కాదట. దర్శకుడు పూరీ జగన్నాధ్.. అందరికీ తెలిసిన ఎన్టీఆర్ జీవితకథను సింపుల్ గా ఓ స్టోరీ లైన్ రూపంలో బాలకృష్ణకు వినిపించగా.. ఆయన నుంచి వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడంతో.. పూరీ స్క్రిప్ట్ పనుల్లో పడ్డాడనే టాక్ వినిపిస్తోంది. గత కొన్ని సినిమాలుగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్న పూరీ.. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ని తీసి సెన్సేషనల్ కం బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.
అయితే.. స్టోరీ విషయంలో పూరీ మాత్రమే కాకుండా.. మరో ఇద్దరు రైటర్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే బ్యాకెండ్ వర్క్స్ తప్ప.. డీటైల్స్ బైటకు రాకపోవచ్చని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28న ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రావచ్చని అంటుండగా.. దర్శకుడిగా మాత్రం పూరీ జగన్నాథ్ వ్యవహరించడం ఇప్పటికే ఖాయమైందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/