Begin typing your search above and press return to search.
పూరీ!! పోలీసులు చేసిందే మీడియా చేసింది
By: Tupaki Desk | 20 July 2017 4:21 AM GMTసిట్ దగ్గర సుదీర్ఘమైన విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాధ్.. అక్కడేం జరిగిందో చూచాయగా చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. మీడియాపై తన ఆక్రోశాన్ని తెలియజెప్పేందుకే ఈ వీడియో పోస్ట్ చేశాడనే విషయం.. చూసిన వాళ్లకు అర్ధమైపోతుంది. నిజమే కదా.. పూరీని మీడియా ఎలా ఆడేసుకుంది అనిపించక మానదు. నిజంగానే పూరిపై ఏదో సిట్ రూమ్లో ఒక చిన్న కెమెరా పెట్టుకుని చూసినట్లు మీడియాలో కథనాలు వచ్చేశాయి.కాని ఇక్కడే ఒక చిన్న లాజిక్ కూడా ఉంది.
తనతో పరిచయం ఉన్నవాళ్లు ఇంతలా తన గురించి కథనాలు ప్రచురించడం తప్పు అంటున్నాడు పూరి జగన్. నిజానికి మీడియా చేసేదే అది. మీడియా జనాలకు పూరీతో ఎలా సన్నిహిత సంబంధాలు ఉంటాయో.. పోలీస్ డిపార్ట్ మెంట్ తో కూడా అంతకు మించి ఉంటాయి. అందుకే పోలీసులు అఫీషియల్ గా చెప్పినా చెప్పకపోయినా.. ఎవరెవరికి నోటీసులు అందాయి.. ఎవరు ఏ రోజున సిట్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది అనే అంశాలను పూసగుచ్చినట్లు చెప్పేసింది మీడియా. పూరీనే మొదట సిట్ ముందు హాజరవుతాడనే అంశం కూడా పోలీసులు చెప్పకపోయినా మీడియాలో డేట్ తో సహా వచ్చిందంటే.. ఇన్ సైడ్ విషయాలు అందుబాటులో ఉండబట్టేగా.
మీడియా మీద ప్రేమతో ఇజం తీసి జర్నలిస్టుల గురించి పాజిటివ్ గా చెప్పానని అంటున్న పూరీ.. ఇప్పుడు మీడియా ఇలా చేయడంతో బాధేసిందని చెప్పడం తెలసిందే. బాగానే ఉంది కానీ.. పోలీసుల గురించి కూడా బోలెడన్ని పాజిటివ్ సినిమాలు తీశాడు కదా అని.. చిన్న లింక్ దొరగ్గానే పూరీని పిలిచి విచారించడం మానేశారా ఏంటి? పోలీసుల జాబ్ పోలీసులు చేసేశారు. అలాగే మీడియా కూడా మీడియా జాబ్ చేసింది. తప్పేముంది పూరి? మరో యాంగిల్లో ఆలోచిస్తే మీడియా కూడా హీరోనేగా. గుర్తించండమ్మా!!