Begin typing your search above and press return to search.
పూరీకి ఉచ్చు బిగుస్తోందట!!
By: Tupaki Desk | 21 July 2017 1:37 PM GMTడ్రగ్ రాకెట్ విషయంలో వ్యవహారం అనుకున్నంత సాఫీగా ఉండేట్లు ఏం కనిపించడం లేదు. ఈ కేసు విషయంలో రాష్ట్రప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంటే.. మొదటి రోజూనే పూరీ జగన్నాధ్ ను విచారించడం.. 11 గంటలకు పైగా విచారణ జరగడంతో.. చాలానే అనుమానాలు ఏర్పడ్డాయి. ఇక రెండో రోజు కెమెరా మ్యాన్ శ్యామ్ కె నాయుడును ఐదున్నర గంటలపాటు విచారించారు అధికారులు.
అయితే.. రెండో రోజు విచారణ తర్వాత పరిణామాలు చాలానే మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మీడియా ఇస్తున్న లీకుల సమాచారం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. పూరీకి డ్రగ్స్ తో లింక్ ఉందని తేల్చనున్నట్లుగా ఉన్నాయి ఛానల్స్ కథనాలు. ఈ విషయాన్ని శ్యామ్ కె నాయుడు.. సిట్ అధికారులతో చెప్పారనేది తాజా వార్త. కెల్విన్ తో పూరీ పలు మార్లు ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా కాంటాక్ట్ చేశాడని.. డ్రగ్స్ కోసమే ఈ కాల్స్ చేయగా.. అందిన డ్రగ్స్ ను స్వయంగా తనే తీసుకెళ్లి పూరీకి అప్పగించినట్లు శ్యామ్ కె నాయుడు ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
బ్యాంకాక్ నుంచి ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ద్వారా కెల్విన్ ను పూరీ సంప్రదించాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కెల్విన్- పూరీల మధ్య ఉన్న గుట్టును శ్యామ్ కె నాయుడు విప్పేసినట్లే అంటున్నారు. ఇదంతా నిజమైతే.. పూరీ చిక్కుల్లో పడ్డాడనే చెప్పాలి.