Begin typing your search above and press return to search.

బ్యాంకాక్‌లో మాటల వేట షురూ

By:  Tupaki Desk   |   23 May 2015 5:30 PM GMT
బ్యాంకాక్‌లో మాటల వేట షురూ
X
పూరి జగన్నాథ్‌కి బ్యాంకాక్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతడు అక్కడ అడుగుపెట్టాడంటే ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. ఓ రకంగా చెప్పాలంటే అతడి శరీరంలోకి ఓ కొత్త ఎనర్జీ వచ్చేది ఈ చోటే. మైండ్‌ జెట్‌ స్పీడ్‌ అందుకునేది ఇక్కడే. గడగడా మాటలు రాసేసుకుంటాడు. జెట్‌ స్పీడ్‌తో స్క్రిప్టులకు ఫైనల్‌ టచ్‌ ఇచ్చేస్తాడు. పక్కా ప్రొఫెషనల్‌గా పనంతా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెడతాడు.

అందుకే బ్యాంకాక్‌లో ఉండి రాసుకున్న అతడి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాయి. ఇటీవలే ఎన్టీఆర్‌ టెంపర్‌ స్క్రిప్టు కూడా బ్యాంకాక్‌లోనే ఫైనల్‌ టచప్‌లు ఇచ్చాడు. అక్కడి బీచ్‌ల్లో కూచుని స్క్రిప్టులు రాస్తుంటే ఆ మజాయే వేరు. ఇప్పుడు మెగాస్టార్‌ నటించే 150వ సినిమాకి మాటలు రాస్తున్నది బ్యాంకాక్‌లోనే. అందుకే అక్కడికి పయనానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. మాటలు సహా బౌండ్‌ స్క్రిప్టుతో తిరిగొచ్చి అప్పుడు ఫైనల్‌గా చిరుకి వినిపిస్తాడు. మార్పు చేర్పులతో అంతా పని ఫినిష్‌ చేసి ఆగస్టు 22న సినిమాని ప్రారంభిస్తారు. అటుపై సెప్టెంబర్‌ 2న పవన్‌ పుట్టినరోజున రెగ్యులర్‌ షూటింగుకి వెళ్తారు. డిసెంబర్‌ నాటికి సినిమా పూర్తి చేసి జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌.

ఏదేమైనా పూరి బ్యాంకాక్‌ వెళ్లి రాస్తున్నాడు కాబట్టి ఫ్లేవర్‌ కూడా అంతే స్పయిసీగా ఉంటుందేమో చూడాలి. ఆటోజానీ పాత్రలోకి కిక్కు ప్రవేశించాలంటే పూరి బ్యాంకాక్‌లో అడుగుపెట్టాల్సిందేని క్రిటిక్స్‌ కూడా కామెంట్లు విసురుతున్నారు. అందుకే మనోడు అక్కడే మాటల వేట షురూ చేశాడు. తన ఫిలాసఫీ మార్కుతో చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మనోడు రఫ్ఫాడిస్తాడని కోరుకుందాం.