Begin typing your search above and press return to search.
చిరుతో పూరీ క్లాషెస్ ఎక్కడ?
By: Tupaki Desk | 14 Dec 2015 4:57 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించే 150వ సినిమా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్. చిరుకి కథ చెప్పి ఒప్పించేందుకు స్టార్ డైరెక్టర్లు, రచయితలు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ఆయన ఓకే చెప్పేదెప్పుడు? అసలు ఇంతమంది దిగ్గజాలు చెబుతున్నవేవీ నచ్చకపోవడానికి కారణాలేంటి? అంటే చాలా సింపుల్ ఆన్సర్. చిరంజీవి 100 శాతం సంతృప్తి చెందే కథని కానీ పూర్తి స్థాయి స్క్రిప్టుని కానీ, ఇంతవరకూ ఎవరూ చెప్పలేదన్నది వాస్తవం.
అప్పట్లో పూరి జగన్నాథ్ చాలా వరకూ వర్కవుట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. మాంచి మాస్ మసాలా కంటెంట్ తో ఆటోజానీ కథని తయారు చేశారాయన. అయితే ప్రథమార్థం నచ్చింది కానీ, ద్వితీయార్థం నచ్చలేదని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అయితే అసలు ఆ రెండో భాగం ఎందుకు నచ్చలేదు అనేదానికి ఆ తర్వాత పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. నిన్నటిరోజున లోఫర్ ప్రమోషన్ లో ఈ విషయంపై పూరీ నోరు విప్పారు.
మెగాస్టార్ 150 సినిమా లో కచ్ఛితంగా వినోదంతో పాటు సందేశం ఉండాలని అనుకున్నారు. నేనేమో పూర్తిగా మాస్ మసాలా సినిమా చెప్పాను. అందుకే డ్రాప్ అయ్యాం. అయినా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడం నా డ్రీమ్. అది 150వ సినిమానా? లేక 151, 152 ఏదైనా కావచ్చు. నెంబర్ నాకు ముఖ్యం కాదు. కలిసి సినిమా చేయడమే ముఖ్యం.. అని క్లారిటీ ఇచ్చాడు స్పీడ్ డైరెక్టర్. ఏదేమైనా ప్రస్తుతానికి చిరుని ఒప్పించేంత తీరిక సమయం తనకి లేదని ఈ సందర్భంలో చెప్పకనే చెప్పాడు. చూద్దాం.. పూరీ కాకుండా ఇంకెవరైనా కథ చెప్పి ఒప్పిస్తారేమో!