Begin typing your search above and press return to search.
నాన్న అలాంటోడు కాదన్న దర్శకుడి కూతురు
By: Tupaki Desk | 16 July 2017 5:07 AM GMTటాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్ స్కాండల్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మత్తుమందుల కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో పూరీకి సన్నిహితంగా ఉండేవారే ఎక్కువగా ఉండడం.. రకరకాల రూమర్లకు దారి తీస్తోంది. అయితే.. అసలు ఈ వ్యవహరంపై నేరుగా ఇప్పటివరకూ ఏ మాత్రం స్పందించలేదు పూరీ. ఒక ట్వీట్ పెట్టినా.. తానెలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని తప్ప.. డ్రగ్స్ అన్న మాట కూడా వాడలేదు.
అయితే.. తన తండ్రి పూరీ జగన్నాధ్ పేరును మీడియా ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తుండడం.. కూతురు పవిత్రకు ఏ మాత్రం నచ్చలేదు. 'నానన ఓ సెలబ్రిటీ కాబట్టి.. ఇలా ఇష్టం వచ్చినట్లు రూమర్లు రాయడం సరికాదు. ఒక కుటుంబం గల వ్యక్తిగా.. ఆయనపై వేలెత్తి చూపించే ముందు.. వారి ఫ్యామిలీ గురించి.. ఆయన రెప్యుటేషన్ గురించి ఆలోచించాలి. పని లేని వాళ్లెవరో తన తండ్రి గురించి చెడ్డగా రాసినంత మాత్రాన.. అబద్ధం నిజమైపోదు. తను ఎప్పుడూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసమే తపన పడుతుంటారు' అని చెప్పింది పవిత్ర.
'ఒక దర్శకుడిగా ఆయన మేథస్సే ఆయన పెట్టుబడి.. భవిష్యత్తు కూడా. అలవాట్లతో కెరీర్ పాడు చేసుకోరు' అని చెప్పిన పవిత్ర.. 'మా నాన్నకు డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు' అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు.. తన తండ్రిపై విమర్శలు చేస్తున్నవాళ్లు.. నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని కూడా హెచ్చరించింది పూరీ పవిత్ర.