Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సరిపోదు
By: Tupaki Desk | 3 Sep 2017 5:43 AM GMTపూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన పైసా వసూల్ థియేటర్లలో సందడి చేస్తోంది. తేడాసింగ్ గా బాలయ్య నటనకు ప్రశంసలు వస్తున్నా.. టాక్ మాత్రం తేడాగానే ఉంది. అయితే ఫ్యాన్స్ ను మెప్పించే విషయంలో మాత్రం బాలయ్య సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ ఒక సినిమా సక్సెస్ సాధించేందుకు.. అందులోనూ ఇప్పటి కలెక్షన్ లెక్కల రోజుల్లో.. ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సరిపోదు.
యాంటీ ఫ్యాన్స్ సంగతి పక్కన పెట్టినా.. సహజంగా చాలా మంది సినిమా ఫ్యాన్స్ ఉంటారు. అంటే వీళ్లు ఏ సినిమా అయినా చూస్తుంటారన్న మాట. పైగా కొందరు కుర్ర హీరోల ఫ్యాన్స్ అయితే.. బాగా న్యూట్రల్ గా ఉంటారు. సినిమా బాగుందంటే చాలామంది ఆడియన్స్ ఫ్యామిలీతో పాటు థియేటర్లకు వస్తారు. కానీ ఇలాంటి వారెవరూ థియేటర్లకు రానవసరం లేదని.. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఒక్క మాటలో చెప్పేశాడు. ఏకంగా హీరో బాలయ్యతోనే "ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఇన్ సైడ్.. ఔట్ సైడర్స్ ఆర్ నాట్ ఎలోడ్" అంటూ రెండుసార్లు డైలాగ్ చెప్పించాడు. థియేటర్లో ఈ డైలాగ్ పేలినా.. సినిమా చూసేందుకు వద్దామని అనుకునే వారిని ఈ డైలాగ్ హర్ట్ చేయడం ఖాయం.
కుటుంబ సభ్యులు.. అభిమానులు చూసినా సరే సినిమా సక్సెస్ అయిపోతుందని అనుకున్నారేమో తెలియదు. మరోవైపు పూరీ కూడా ఇతర హీరోలతో సినిమాలు తీసినవాడే. ప్రత్యేకించి తనకంటూ అభిమానులను క్రియేట్ చేసుకున్నవాడే. అలాంటిది ఇప్పుడు బాలయ్యతో సినిమా చూస్తూ.. ఆయన ఫ్యాన్స్ తప్ప మిగతావాళ్లెవరూ సినిమా చూడాల్సిన అవసరం లేదని ఇన్ డైరెక్టుగా చెప్పడం ఎందుకో పూరీకే తెలియాలి.