Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ గిఫ్టే... కానీ నిజం షిట్టు!

By:  Tupaki Desk   |   5 Feb 2019 7:36 AM GMT
ఇస్మార్ట్ గిఫ్టే... కానీ నిజం షిట్టు!
X
పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా చిత్రీకరణలో పూరి స్పీడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సినిమా అతి త్వరలో మనముందుకు వస్తుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. పూరి-రామ్ కాంబినేషన్ మొదటి సారి కావడంతో హీరో.. దర్శకుడు ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్ గా పూరికి హీరో రామ్ ఒక ఎక్స్ పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చాడట.

ఆ గిఫ్ట్ ప్రపంచంలో నే అత్యంత ఖరీదైన కాఫీ ప్యాకెట్లు. ఈ విషయాన్ని పూరి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. కాఫీ సాచెట్ల ఫోటోలతో పాటుగా కాఫీ తాగుతూ ఉన్న మరో ఫోటో పోస్ట్ చేసి "మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్ నాకు ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కోపి లువాక్ కాఫీ ని గిఫ్టుగా ఇచ్చాడు. దయచేసి మీరు గూగుల్ చేయండి.. మీకు పిచ్చెక్కడం ఖాయం. నేనిప్పుడు సిప్ చేస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు. ఇదు డిప్ లు ఉండే ఈ కాఫీ ప్యాక్ ధర ఇండియాలో దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది.

ఈ కోపి లువాక్ ట్విట్టర్ హంగామా చూసి హీరోయిన్ నభా నటేష్ "ఆహ.. సెట్స్ లో ఉండే సమయంలో ఇలా జరిగితే బాగుటుందని అనుకుంటున్నా" అని పూరి ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. దీనికి సమాధానంగా పూరి "ఇస్మార్ట్ కాఫీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యు" అంటూ కాఫీ ఆఫర్ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే పూరి బిజినెస్ పార్టనర్ ఛార్మీ మాత్రం ఈ కాఫీ హంగామా పై మరోరకంగా స్పందించింది. "షిట్ షిట్ షిట్" అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఊరికే షిట్ అనలేదు. ఈ కాఫీ నిజంగానే షిట్ లోనుంచే వస్తుంది. సివెట్ క్యాట్ అనే అడవి పిల్లికి కాఫీ పండ్లు తిన్పించి దాని మలం నుండి కాఫీ బీన్స్ సేకరిస్తారు. దానివల్ల కాఫీకి అద్భుతమైన రుచి వస్తుందట! మరి ఇది షిట్టు కాక ఇంకేంటి?