Begin typing your search above and press return to search.

పూరి గురువు మాట కూడా విన‌లేదే!

By:  Tupaki Desk   |   8 Nov 2015 10:30 PM GMT
పూరి గురువు మాట కూడా విన‌లేదే!
X
ఒక్క‌సారి క‌మిట్ అయితే నా మాట నేనే విన‌ను... అంటూ పోకిరి కోసం డైలాగ్ రాశాడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమాలో మ‌హేష్‌ బాబు క్యారెక్ట‌ర్‌ నిబ‌ట్టే ఆ డైలాగ్ రాశాడ‌నుకొంటాం. కానీ పూరి శైలి కూడా అంతే అని ఇప్పుడు తెలుస్తోంది. లోఫ‌ర్ టైటిల్ చుట్టూ జ‌రిగిన త‌తంగాన్నే అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

వ‌రుణ్‌ తేజ్ క‌థానాయ‌కుడిగా లోఫ‌ర్ అనే సినిమాని తెర‌కెక్కించాడు పూరి. మొద‌ట్లో మెగా ఫ్యామిలీకి ఆ టైటిల్ న‌చ్చుద్దో లేదో అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ పూరి వాళ్ల‌నీ ఒప్పించేశాడు. అయితే సినిమా సెట్స్‌ పై ఉన్న‌ప్పుడు లోఫ‌ర్ వ‌ర్కింగ్ టైటిలేమో, భ‌విష్య‌త్తులో పేరు మారుస్తారేమో అని అంతా ఊహించారు. అందుకే ఆ విష‌యం గురించి ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పూరి మాత్రం మొద‌ట్నుంచీ ఆ పేరునే ఫిక్స‌యిపోయాడు. తీరా సినిమా పూర్త‌య్యాక, లోఫ‌ర్ టైటిల్‌ ని పూరి మార్చేలా లేడ‌న్న విషయం స్ప‌ష్ట‌మ‌య్యాక చాలామంది పేరు మారిస్తేనే బాగుంటుందేమో అన్న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. ర‌షెస్ చూసిన‌ప్పుడు పూరి గురువు రామ్‌ గోపాల్ వ‌ర్మ కూడా అదే చెప్పాడ‌ట‌. నిర్మాత‌లు కూడా పేరు మార్చాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టార‌ట‌. కానీ పూరి మాత్రం ఎవ‌రు చెప్పినా విన‌లేదు.

రామ్‌ గోపాల్ వ‌ర్మ సినిమా పేరుని మార్చ‌మ‌న్నాడ‌ని స్వ‌యంగా పూరినే చెప్పాడు కానీ... తాను మారుస్తాన‌ని మాత్రం చెప్ప‌లేదు. రామ్ గోపాల్ వర్మ అంటే పూరి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు. కానీ లోఫర్ టైటిల్ మాత్రం క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఉంద‌నిపించ‌డంతోనే ఎవరెన్ని చెప్పినా పూరి వెన‌క్కి త‌గ్గ‌లేదు.

మ‌ద‌ర్ సెంటిమెంట్‌ తో కూడిన క‌థ కాబ‌ట్టి మా అమ్మ సీతామాల‌క్ష్మి టైటిల్ అయితే బాగుంటుంద‌ని వ‌ర్మ చెప్పినట్టు తెలిసింది. గురువు మాటకి తలొగ్గి ఆ పేరే ఫిక్స్ చేయొచ్చని మాట్లాడుకున్నారంతా. కానీ అది జరగలేదు. ఇడియ‌ట్‌ - పోకిరి - దేశ‌ముదురులాంటి పేర్లతో పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ సూప‌ర్‌ హిట్ట‌య్యాయి. ఇప్పుడు లోఫ‌ర్ కూడా అలాగే స‌క్సెస్ అందుకొంటుందేమో చూడాలి.