Begin typing your search above and press return to search.
మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ ఫిక్స్
By: Tupaki Desk | 13 Nov 2018 6:58 AMనందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో జరుగబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఈ విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలయ్య ఎన్నో కథలను విన్నాడని, కొన్నింటిని సెలక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందనుకున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే అవకాశం లేదని తేలిపోయింది.
ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ప్రస్తుతానికి ఆలోచించడం లేదని తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం మరో వైపు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం వినాయక్ - క్రిష్ - బోయపాటి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ జాబితాలో పూరి జగన్నాధ్ కూడా చేరినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో పూరికి హిట్ లు లేవు. కాని కొన్నాళ్ల క్రితం పూరి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న విషయం తెల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ‘చిరుత’ చిత్రంతో పరిచయం చేశాడు. అందుకే మోక్షజ్ఞ బాధ్యతను పూరికి ఇస్తే ఎలా ఉంటుందా అనే చర్చ కూడా నందమూరి బాలయ్య అండ్ కో చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూరి కే ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మోక్షజ్ఞ యూఎస్ లో నటన శిక్షణలో ఉన్నాడు.