Begin typing your search above and press return to search.
పూరి కథకు రామ్ గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 18 Nov 2018 7:47 AM GMTనీ టార్గెట్ 10 మైల్స్ అయితే .. ఎయిమ్ ఫర్ లెవంత్ మైల్..! ఈ ఒక్క డైలాగ్ చాలు పూరిలో ఎంత కసి ఉందో చెప్పడానికి. కొడ్తే కుంభాన్ని కొట్టాలి అనేది పూరి మైండ్ సెట్. కింది స్థాయి నుంచి ఎదిగిన వాడిగా అతడిలో ఆ కసి ఎప్పుడూ ఉంటుంది. తాను ఆశించినట్టే అగ్ర దర్శకుడిగా లెవంత్ మైల్‌ని టచ్ చేశాడు. అయితే అక్కడి నుంచి కిందపడడం అన్నదే కాస్త ఇబ్బంది కలిగించింది. అయినా పడ్డవాడెపుడూ చెడ్డవాడు కాదు.. చెడిన వాడు అసలే కాదు!! అందుకే ఈసారి పూరి స్టెన్ గన్ ఎక్కుపెడుతున్నాడు. అపజయాల బాట నుంచి జయం కోసం వీరుడిలా దూసుకొస్తున్నాడు. కత్తి దూస్తాడా.. బుల్లెట్టు దించుతాడా? అన్నది తెలియాలంటే కాస్త ఆగాలి.
పూరి.. పూరి .. పూరి.. వాటీజ్ పూరి?! నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రినాథ్! .. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు! ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా! ... దటీజ్ పూరి. ఇలాంటి భారీ పంచ్ డైలాగుల్ని పూరి నుంచి ఇంకా ఇంకా వినే ఛాన్సుందని సంకేతాలు అందాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులతో రికార్డు సృష్టించినా ఇంకా ఏదో కసి అతడిలో ఉంది. ఇప్పటికి హిట్టు లేక టాప్ హీరోలు అతడికి పూర్తిగా మొహం చాటేసినా అందరినీ దారిలోకి తెస్తానన్న నమ్మకం పూరిలో బలంగా ఉందిట. కొడుకు ఆకాష్ అందుబాటులోకి వచ్చాడు. నితిన్ - రామ్ లాంటి హీరోలు ఆదుకోవడానికి ఉన్నారు. ఈసారి రామ్ వంతు వచ్చింది!
గత కొంతకాలంగా ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా కోసం పూరి ఎంతో కసరత్తు చేస్తున్నాడు. ఇదే విషయంపై రామ్ నే అడిగితే ... కథ ఇంకా పూర్తి కాలేదు. ఫైనల్ చేయలేదని ఇటీవల `హలో గురూ ప్రేమకోసమే` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ కథ ఇప్పటికి ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. పూరి వినిపించిన కథ సాంతం విని రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కథను పూర్తిగా డెవలప్ చేసేందుకు - డైలాగ్స్ రాసేందుకు బ్యాంకాక్ లో ప్రస్తుతం కుస్తీలు పడుతున్నాడట. మరోసారి పెన్ పవరేంటో చూపించాలన్న కసితో పూరి రగిలిపోతున్నాడట. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.