Begin typing your search above and press return to search.

మళ్లీ బ్యాంకాక్ లో దుకాణం

By:  Tupaki Desk   |   29 March 2016 7:30 PM GMT
మళ్లీ బ్యాంకాక్ లో దుకాణం
X
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు తీసే స్పీడ్ చూస్తే.. పూరీకి గిన్నిస్ అవార్డ్ కూడా ఇచ్చేయచ్చేమో అనిపిస్తుంది. బహుశా అప్లై చేసి ఉండడు కానీ.. లేకపోతే ఈపాటికే ఓ అరడజన్ గిన్నిస్ లను ఇంట్లో అలంకరించుకునేవాడు. ఇన్నాళ్లూ ఇదంతా రైటే అయినా.. ఇప్పుడో మూవీ విషయంలో మాత్రం తేడా కొడుతోంది. రోగ్ అంటూ ఓ మూవీ తీస్తున్నానని.. పూరీ అప్పుడెప్పుడెప్పుడో చెప్పాడు.

అయితే ఈ సినిమాకి హీరోయిన్ల సమస్య వచ్చింది. ఐషా శర్మ - అమైరా దస్తూర్ - మన్నారా చోప్రా - పూజా జవేరి - ఏంజెలీనా క్రిస్లింజ్కి వంటి ఎందరినో మార్చాల్చి వచ్చింది. పోనీ వీళ్లలో ఇద్దరిని ఫైనల్ చేసుకుని సినిమా చేస్తూ లెక్క చూస్కుంటే.. ఇప్పటికే 50 కోట్లు దాటిపోయిందట బడ్జెట్. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

మరోవైపు రోగ్ మూవీని పూర్తిగా బ్యాంకాక్ లో షూట్ చేసేస్తున్నాడు పూరీ. గతంలో తన సినిమాల్లో కొన్ని పాటలను ఇలా బ్యాంకాక్ లో పిక్చరైజ్ చేసేవాడు. కానీ దేవుడు చేసిన మనుషులు మాత్రం పూర్తిగా బ్యాంకాక్ లోనే తీశాడు. తీరా అది ఢమాల్ అంది. ఇప్పుడు మళ్లీ బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లోనే ఫుల్ లెంగ్త్ గా రోగ్ తీసేస్తున్నాడు. దీని రిజల్ట్ ఎలా ఉటుందో?