Begin typing your search above and press return to search.
పూరి.. మూడేళ్ల స్క్రిప్టులు.. 10 ఏళ్ల కథలు
By: Tupaki Desk | 30 April 2018 2:49 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ అంత వేగంగా సినిమాలు తీసే దర్శకుడు మరొకరు కనిపించరు. ఒక్క రోజులో కథ.. వారం రోజుల్లో పూర్తి స్క్రిప్టు రాసేసి.. మూణ్నాలుగు నెలల్లో సినిమా తీసేస్తుంటాడు పూరి. హిట్లు ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా పూరి ఇదే స్పీడు చూపిస్తుంటాడు. వరుస ఫ్లాపుల వల్ల ఆయన వెనుకబడ్డట్లు అనిపించినప్పటికీ మున్ముందు కూడా ఈ వేగం ఏమీ తగ్గదంటున్నాడు. తాను ఎంతో మనసు పెట్టి తీసిన ‘మెహబూబా’ కచ్చితంగా విజయవంతమవుతుందని.. ఆ తర్వాత మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తానని పూరి చెబుతున్నాడు. తన దగ్గరున్న ఐపాడ్ లో మూడేళ్లకు సరిపడా స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని.. ఏడాదికి మూడు సినిమాల చొప్పున తీయాలనుకుంటున్నానని పూరి వెల్లడించాడు.
అలాగే ఇంతకుముందు అన్నట్లే తన దగ్గర పదేళ్లకు సరిపడా కథలు సిద్ధంగా ఉన్నాయని పూరి మరోసారి స్పష్టం చేశాడు. తనతో పని చేయడానికి ఇప్పుడు కూడా స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని పూరి అన్నాడు. తాను చేసిన సినిమాలు ఫెయిలై ఉండొచ్చు కానీ.. తనతో పని చేసిన హీరోలకు ఆ సినిమాలు మంచి పేరే తెచ్చాయని.. తన సినిమాల్లో హీరోలు ఎప్పుడూ ఫెయిలవ్వలేదని పూరి అన్నాడు. ‘మెహబూబా’ తర్వాత తాను చేయబోయే రెండు సినిమాలూ తన కొడుకు ఆకాశ్ తోనే ఉంటాయన్న పూరి.. ఆ తర్వాత వేరే హీరోలతోనే సినిమాలు చేస్తానన్నాడు. ఇంకో రెండు సినిమాలు చేస్తే ఆకాశ్ నిలదొక్కుకుంటాడని.. ఆ తర్వాత తన కెరీర్ తన ఇష్టమని స్పష్టం చేశాడు. తాను మాత్రం ఓపిక ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటానని చెప్పాడు.