Begin typing your search above and press return to search.

గ్లామర్ ను అందుకే దూరం పెట్టాడా?

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:30 PM GMT
గ్లామర్ ను అందుకే దూరం పెట్టాడా?
X
ఈ మధ్య కాలంలో ఏ సినిమా తీసుకున్నా కూడా హీరోయిన్ల గ్లామర్ తో కాస్త ఎక్కువగానే ఫ్రేమును నింపేస్తున్నారు. ఇక పూరి జగన్ అయితే గ్లామరసాన్ని పండించి పిండుకోవడంలో నిష్ణాతుడు. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఓమారు గుర్తుకు తెచ్చుకుంటే ఆ విషయం అర్దమైపోతుంది.

ఇద్దరమ్మాయిలతో సినిమాలో క్యాథరీన్.. హార్ట్ ఎటాక్ లో అదా శర్మ.. టెంపర్ లో కాజల్.. లోఫర్ లో దిశా పటానీ.. అందరూ కూడా పొట్టి పొట్టి బట్టల నుండి.. క్లీవేజ్ అందాల వరకు బాగానే ఆరబోశారు. పూరి సినిమాల్లో గ్లామర్ కు ఏమాత్రం లోటుండదు అనేది అందుకే. అయితే ఇప్పుడు ''ఇజం'' మూవీ వీడియోలు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి. మిస్ ఇండియా అదితి ఆర్య అంటే.. గ్లామరసం పండించడానికి అభ్యంతరం చెప్పింది అనుకోలేం. కాని పూరి జగన్ మాత్రం ఒక్క చోట కూడా అసలు ఆ గ్లామర్ జోలికే పోలేదు. ఎందుకంటారు?

ప్రతీసారీ ఇలా మాంచి పాట్టలో హీరోయిన్ల గ్లామర్ తో బండి నడిపించేస్తున్నాడు అనే రిమార్కు వస్తోంది కాబట్టి.. ఈసారి పూర్తిగా మనోడు కంటెంట్ మీదనే డిపెండైనట్లున్నాడు. అందుకే కావాలనే హీరోయిన్ గ్లామర్ ఏ మాత్రం ఆరబోయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు పూరి. భలే కొత్త ప్రయత్నం కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/