Begin typing your search above and press return to search.

బాలయ్య తన ఫ్యాన్ ను కొడితే.. లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   18 Aug 2017 3:47 AM GMT
బాలయ్య తన ఫ్యాన్ ను కొడితే.. లవ్ స్టోరీ
X
గత కొద్దిరోజులుగా అభిమానిని బాలయ్య కొట్టడం అనేది ఒక రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఆ మధ్యన జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్లో బాలయ్య తన అభిమానిని కొట్టడం.. అలాగే ఒక షూటింగ్ లాంచ్ సమయంలో అక్కడే ఉన్న ఒక కాస్ట్యూమ్ అసిస్టెంట్ ను కొట్టడం.. ఇవన్నీ రొటీన్ అయిపోయాయ్. కాని ఇదంతా కూడా ప్రేమే అంటున్నాడు దర్శకుడు పూరి జగన్.

''నిజానికి ఈ మధ్యన మీడియాలో బాలయ్య తన అభిమానిని కొట్టడం గురించి తెగ చెబుతున్నారు. అసలు బాలయ్య బాబుకు బయటకు రావాలంటే ఇతర హీరోలకు అవసరమైనట్లు బౌన్సర్లే అక్కర్లేదు. ఎందుకంటే తన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోవడం ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడన్న ఎవరన్నా అభిమానిని కొట్టినా.. అది వాళ్ళకు ఇష్టమే. ఇంకా కొట్టండి అన్నట్లు ప్రేమిస్తారు ఆయన్ను. అలా ఆయన కొట్టడంలో వారిపై ప్రేమే ఉంటుంది కాని.. ఇంకేమీ ఉండదు. సో మీడియావాళ్ళు ఈసారి నుండి మీనింగ్ మార్చి రాసుకోండి. బాలయ్య తన ఫ్యాన్ ని ఎవరినన్నా కొడితే.. అది ఒక లవ్ స్టోరీ అంతే'' అంటూ పూరి జగన్ తనదైన స్టయిల్లో ఆ కొట్టుడు గురించి లెక్చర్ ఇచ్చాడు.

మొత్తానికి పూరి స్పీచ్ విన్న అభిమానులు కూడా పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. తమ హీరో తమను ఎప్పుడన్నా ఒక మాట అన్నా లేదంటే ఒక దెబ్బ కొట్టినా కూడా మాకు సమంజసమే అన్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. అది సంగతి.