Begin typing your search above and press return to search.
అయ్యో పూరీ... బ్యాడ్ లక్..!
By: Tupaki Desk | 20 April 2020 1:30 AM GMTజనాలే కాదు ఆ దేవుడు కూడా పూరీ ఫ్యామిలీ నుంచి హీరోలు రావడం ఇష్టపడటం లేనట్లుంది. ఎందరో ముక్కు వంకర.. మూతి వంకర.. కాలు వంకరున్న అతి సాధారణ హీరోల్ని సూపర్ స్టార్లుగా చేసిన ఘనత పూరీకి ఉంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. నాగార్జున - మహేశ్ బాబు - పవన్ కళ్యాణ్ - రవితేజ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే అవుతుంది. అయితే పూరీకి ఉన్న ఏకైక రిమార్క్ తన ఫ్యామిలీ నుంచి హీరోల్ని తయారు చేయలేకపోవడం. తమ్ముడు సాయిరామ్ శంకర్ ని మాస్ హీరోగా చెద్దాం అని మాగ్జిమమ్ ట్రై చేశాడు కానీ కుదర్లేదు. '143' సినిమాతో తన తమ్మడు సాయిరామ్ శంకర్ ని హీరోగా పరిచయం చేసాడు. మిగతా హీరోల పై పనిచేసిన పూరీఇజం తమ్ముడు సాయి మీద వర్క అవుట్ అవ్వలేదు.
అందుకే పూరీ ఈసారి కొడుకుని రంగంలోకి దింపాడు. పూరీ ఆకాష్ ని 'మెహబూబా' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసాడు. భారీ ఆశలు పెట్టుకుని తీసిన మెహబూబా సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కథ - స్క్రీన్ ప్లే - మాటలు రాసి 'రొమాంటిక్'గా తీయమని కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాతో ఎలాగైనా తన కొడుకుని నిలబెట్టాలనుకున్న పూరీ దగ్గరుండి మరీ తనయుడితో రొమాన్స్ చేపించాడు. దీని కోసం ఆకాశ్‌కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మని తీసుకున్నాడు. బీచ్ అందాల మధ్య అన్నీ ఆరబోసింది ఈ ముంబై బ్యూటీ. ఇప్పటికే విడుదలైన బీచ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆ తర్వాత విడుదలైన పాటకు కూడా మంచి స్పందనే వచ్చింది. దీంతో 'రొమాంటిక్' సినిమాకి బాగానే క్రేజ్ వచ్చింది.
మంచి టైమ్ చూసి ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ వేసుకున్న పూరీ అండ్ టీమ్ కి ఇప్పుడు నిరాశే మిగిలింది. ఈసారి బ్యాడ్ లక్ కరోనా రూపంలో వచ్చింది. ఈ సినిమాకు పూరీ డైరెక్టర్ అవ్వకపోవడంతో ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఆకాష్ పూరీ సినిమాకు రిలీజ్ డేట్ అంత ఈజీగా దొరక్కపోవచ్చు. దొరికినా వెయిటింగ్ చేయాల్సిందే. దీంతో 'రొమాంటిక్'ని ఆపలేక.. మరో సినిమాకి కమిట్ అవ్వలేక.. పూరీకి సన్ స్ట్రోక్ వచ్చేస్తుందని ఫిల్మ్ ఫోక్స్ కామెంట్స్ చేస్తున్నారట..!