Begin typing your search above and press return to search.
కొడుకుతో పూరి మరీ అంత కఠినంగానా..
By: Tupaki Desk | 30 April 2018 10:55 AM GMTతన తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించాడు పూరి జగన్నాథ్. అలాంటి స్టార్ డైరెక్టర్ కొడుకుగా పుట్టిన పూరి ఆకాశ్ చిన్నప్పట్నుంచే చాలా లగ్జరీస్ అనుభవించి ఉంటాడని అనుకుంటాం. కానీ తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న పూరి.. ఆ కష్టాలు తన కొడుక్కి కూడా తెలియాలని చిన్నప్పట్నుంచి చాలా కఠినంగా వ్యవహరించాడట. చిన్నతనంలోనే మూడేళ్ల పాటు హాస్టల్లో వేసేశాడట. ఆ మూడేళ్లు ఆకాశ్ చాలా ఇబ్బంది పడ్డాడట. ఏడ్చాడట. అయినా అతడిని అక్కడే పెట్టారట. తన పనులు తానే చేసుకోవడం అలవాటవడంతో పాటు ఇంకా జీవితం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయనే తాను అలా చేశానని పూరి చెప్పాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాగానే ఆకాశ్ కు ఇల్లొక స్వర్గం లాగా అనిపించిందని.. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకున్నాడని పూరి తెలిపాడు.
ఇక ఆకాశ్ సినిమాల్లోకి రావాలనుకున్నపుడు తనతో పాటు షూటింగులకి తీసుకెళ్లడం.. అవకాశమున్నపుడు చిన్న చినన పాత్రలు ఇవ్వడం చేశానని.. కానీ అక్కడ అతడికి రాయల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండేది కాదని పూరి చెప్పాడు. ముందు సినిమా షూటింగ్ లో తాను అతడికి ఇచ్చిన బాధ్యత యూనిట్లో అందరినీ పేరు పేరునా పలకరించి టీలు కాఫీలు ఇవ్వడమే అని పూరి తెలిపాడు. అతను తనతో కలిసి భోంచేసేవాడు కూడా కాదని.. అసిస్టెంట్లతోనో ఎక్కడో నిలబడి తినేవాడని అన్నాడు. ఇక ఔట్ డోర్ షూటింగులకు వెళ్లాల్సినపుడు తాను ఫ్లైట్లో వెళ్తే ఆకాశ్ మాత్రం మిగతా వాళ్లతో కలిసి రైల్లో వెళ్లేవాడన్నాడు. ఇలా సినీ రంగంలో ఆకాశ్ అందరి లాగే చాలా కష్టాలు పడ్డాడని.. ఇప్పుడు అతడికి జీవితం విలువ బాగా తెలిసిందని అన్నాడు. హీరోగా కూడా అతడికి మరీ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదన్నాడు పూరి. మామూలుగా హీరో అంటే ఆటోమేటిగ్గా బాడీలోనే ఒక పొగరు కనిపిస్తుందని.. తన కొడుకు మాత్రం అదేమీ చూపించకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పూరి తెలిపాడు.