Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ 100కోట్లు గ్యాంబ్లింగ్
By: Tupaki Desk | 21 Dec 2018 4:27 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పుల గురించి - మోసపోయిన వైనం గురించి తెలిసిందే. చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో తనని నమ్మిన వాళ్లే దారుణంగా మోసం చేశారని దర్శకుడు పూరి జగన్నాథ్ చెబుతుండేవారు. స్నేహితులను ఎంతో నమ్మి బిజినెస్ లో పెట్టుబడులు పెడితే తనని మోసం చేశారని పూరి స్వయంగా మీడియాకు చెప్పిన సందర్భాలెన్నో. ఆ క్రమంలోనే అప్పుల పాలై చివరికి ఉన్న ఆస్తుల్ని అమ్ముకున్నారని ప్రచారమైంది.
ఆ తర్వాత పూరి కంబ్యాక్ కూడా అంతే ఇంట్రెస్టింగ్. మోసపోయి డబ్బు పోగొట్టుకున్న తర్వాత అతడు ప్రతిభనే నమ్ముకున్నాడు. రెట్టించిన కసితో పని చేశాడు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుని కంబ్యాక్ అయ్యాడు. పోగొట్టుకున్న దాంట్లో తిరిగి కొంత సంపాదించుకున్నాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ - మాదాపూర్ పరిసరాల్లో `కేవ్`ని నిర్మించాడు. ఈ కేవ్ లో సకల సౌకర్యాల్ని సమకూర్చుకున్నాడు. అద్భుతమైన విదేశీ టెక్నాలజీతో ఈ భవంతిని నిర్మించి ఇక్కడే తన స్టాఫ్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు. స్క్రిప్టులు తయరీ నుంచి అసిస్టెంట్ల టీమ్ కి వర్క్ ఇవ్వడం వరకూ అన్నీ ఇక్కడే.
అదంతా అటుంచితే.. అప్పట్లో పూరి ఎంత పోగొట్టుకున్నాడు. భాగస్వాములతో బిజినెస్ అనే గ్యాంబ్లింగ్ అతడిని ఎంతకు ముంచింది? అంటే ఏకంగా 100కోట్ల మేర మోసపోయాడన్న మాటా వినిపిస్తోంది. ఆ క్రమంలోనే అప్పట్లో తన సొంత ఆఫీస్ ని అమ్మి అప్పు కట్టాడన్న మాటా వినిపించింది. అంత పెద్ద మొత్తం కాబట్టే ప్రతి సందర్భంలో దాన్ని తలచుకుని బాధపడేవాడు. అయితే ఎంత నష్టం వాటిల్లినా.. ఆ తర్వాత అంతే కసితో సినిమాలు తీసి తిరిగి నిలబెట్టుకుని వీరుడు అనిపించాడు. సినీరంగంలో ఎగుడు దిగుడు జీవితాన్ని అనుభవించిన వాడిగా పూరి అన్నిటినీ తట్టుకున్నాడు. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నా.. తిరిగి కంబ్యాక్ కోసం అలుపెరగని యోధుడిలా గెలుపు పోరాటం సాగిస్తున్నాడు. కొడుకు ఆకాష్ ని హీరోగా నిలబెట్టేందుకు హైదరాబాద్ లో ఉన్న ఓ ఇంటిని పూరి అమ్ముకున్నాడని అప్పట్లో ప్రచారం సాగింది. ఆకాష్ హీరోగా నటించిన `మెహబూబా` ఫ్లాపైంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి ఆకాష్ తో మరో సినిమాకి పూరి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పూరి అసిస్టెంట్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే సినిమా అధికారికంగా ప్రారంభం కానున్న సంగతి విదితమే. పోగొట్టుకున్న వాడిలోని కసి పూరి సినిమా డైలాగుల్లో వినిపిస్తుంటుంది. ఎయిమ్ ఫర్ లెవంథ్ మైల్! అంటూ కసి చూపిస్తారు అందుకే!!