Begin typing your search above and press return to search.
ఆయన టేకింగ్ మారిందటగా..
By: Tupaki Desk | 26 Oct 2017 6:09 AM GMTటాలీవుడ్ లో తన దర్శకత్వ ప్రతిభతో ఎంటర్టైన్ చేసే సత్తా ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. కానీ గత కొంత కాలంగా ఈ దర్శకుడు తడబడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలను చేశాడు. తన కలం బలంతో ఒక్కో హీరో క్యారెక్టర్ ని తనదైన శైలిలో చూపించి ఇండస్ట్రీ రికార్డులను తీరగరాశాడు. పూరితో ఒకప్పుడు సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు.
కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా!. సో.. ఇప్పుడు మళ్లీ తన వాడి వేడిని చూపించి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తన కొడుకు ఆకాష్ తో మెహబూబా అనే సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ను పూరి తన రెగ్యులర్ ఫార్మాట్ కి బిన్నంగా తెరకెక్కిస్తున్నాడట. పూరి జగన్నాథ్ లవ్ రొమాంటిక్ సినిమాలను తీసి చాలా కాలమే అయ్యింది. అందుకే ఆడియన్స్ కూడా మనోడు ప్యూర్ లవ్ స్టోరీ తీస్తాడా లేదంటే పంచులతో కూడిన రొటీన్ స్టోరీ తీస్తాడా అని తెగ వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ సారి ఆ ఫార్మాట్ తో పాటు కొంచెం సప్సెన్స్ ని కూడా జోడించి కథను ఆసక్తిగా తెరకెక్కిస్తున్నాడట. చిత్ర యూనిట్ కూడా పూరి టేకింగ్ కు చాలా ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. మరి పూరి ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం హిమాచల్ లో షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ ఛార్మి దగ్గరుండి ప్రొడక్షన్ పనులను చూసుకుంటోంది.