Begin typing your search above and press return to search.
మగధీర ఫార్ములానే నమ్ముకున్న పూరీ?
By: Tupaki Desk | 10 April 2018 11:06 AM GMTఒకే కథను మార్చి మార్చి చెప్పడం ఎలాగో దర్శకుడు పూరీ జగన్నాథ్ కు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో! అంతేనా అసలు కథే లేకుండా సినిమా తీయడమూ ఆయనకి తెలుసు. కొన్నాళ్లుగా సొంత కథలతో సరైన హిట్లు లేని పూరీ... ఇప్పుడు తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తన ఫార్ములాని వదిలి- సంచలన దర్శకుడు రాజమౌళి ఫార్ములాతో సినిమా తీశాడట.
పునర్జన్మ కాన్సెప్టుతో ‘మగధీర’- ‘ఈగ’ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టాడు ఎస్.ఎస్. రాజమౌళి. అందుకే తన కొడుకుని గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు జక్కన్న ఫార్ములానే ఫాలో అయిపోతున్నాడట పూరీ. ఇప్పటికే విడుదలయిన చిత్ర టీజర్ కూ- ట్రైలర్ కూ మంచి స్పందన వచ్చింది. ఇండో- పాక్ సరిహద్దులో హిందూ సైనికుడికీ... ముస్లిం అమ్మాయికీ మధ్య జరిగే ప్రేమకథ అని తెలిసిపోతోంది. అయితే కనిపించే విజువల్స్ అన్నీ ఒక జన్మలోనివేనని... ఈ జన్మలో ఇరుదేశాల ఘర్షణలో హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోయి... మరు జన్మలో పుట్టి కలుసుకుంటారని అంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజంగా ఇదే స్టోరీ అయితే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఎందుకంటే చాలా రోటీన్ ఫార్ములా. ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అదీ పూరీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి సినిమా అంటే మరెంతో కొత్తదనం ఆశిస్తారు.
అంతేకాక ట్రైలర్ ను పక్కాగా కట్ చేసి... థియేటర్ కి వెళ్లాక పాత బొమ్మే చూపించడం పూరీకి అలవాటే. ‘రోగ్’- బాలయ్యతో తీసిన ‘పైసా వసూల్’ సినిమాల ట్రైలర్లు విపరీతంగా ఆకట్టుకున్నా... సినిమాలు మాత్రం ఆడలేదు. మరి ఈ పునర్జన్మ ఫార్ములా పూరీకి హిట్టునిస్తుందా... ఆకాష్ ను హీరోగా నిలబెడుతుందా... తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.