Begin typing your search above and press return to search.

పునర్జన్మలు కలిసొస్తాయా పూరీ?

By:  Tupaki Desk   |   9 May 2018 6:58 AM GMT
పునర్జన్మలు కలిసొస్తాయా పూరీ?
X
సినిమాలకు పునర్జన్మలు కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్. స్టోరీ చాలా సింపుల్. గత జన్మలో విడిపోయిన ప్రేమికులు.. ఈ జన్మలో ఎలా కలుస్తారు అన్నదే థీమ్. ఈ కథతో చాలానే సినిమాలు వస్తుంటాయి. అంతెందుకు.. టాలీవుడ్ వసూళ్ల రేంజ్ ను మార్చేసిన మగధీర కూడా ఇదే లైన్ లో ఉంటుంది.

ఈ నెల 11న రిలీజ్ కాబోతోన్న పూరీ జగన్నాధ్ మూవీ మెహబూబా స్టోరీ కూడా ఇలాంటిదే. కాకపోతే తమ సినిమాకు మగధీరకు సంబంధం ఉండదని చెబుతున్నాడు హీరో ఆకాష్ పూరీ. నిజానికి దర్శకుడు పూరీ జగన్నాధ్ కు.. ఈ సినిమా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అందుకే చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. కథ విషయంలో కూడా బాగానే కసరత్తు చేశాడు. కొడుకును హీరోగా తను గ్రాండ్ గా రీలాంఛ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకేసమే.. మెహబూబా అంటూ పునర్జన్మల కథ రాసుకొచ్చాడు. స్క్రీన్ ప్లే ప్రకారం.. ఇంటర్వెల్ కు ముందు ఒక జన్మ.. తర్వాత ఒక జన్మ ఉంటాయట.

అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా ఇండియాలోనే సాగుతుందట. అంటే ఇక్కడే పుట్టిన ఇద్దరూ తెగ ప్రేమించేసుకుంటారట. అనుకోని కారణాలతో విడిపోవడమే కాదు.. మరణిస్తారు కూడా అంటున్నారు. ఆ తర్వాత జన్మలో ఒకరు ఇండియాలో.. మరొకరు పాకిస్తాన్ లో పుడితే.. స్టోరీ ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా థీమ్ అంటున్నారు. మొత్తం మీద జనాలను ఎంగేజ్ చేయడం కోసం.. పూరీ గట్టిగానే ఫిక్స్ అయ్యాడని అర్ధం అవుతోంది. మరి పూరీకి పునర్జన్మలు కలిసొస్తాయో లేదో చూడాలి.