Begin typing your search above and press return to search.
పూరి చెప్పిన ప్రకాష్ రాజ్ మట్టి కథ
By: Tupaki Desk | 17 Sep 2016 1:30 PM GMTరెండు మూడేళ్ల ముందు వరకు మనం చూసిన ప్రకాష్ రాజ్ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రకాష్ రాజ్ వేరు. నటుడిగా అద్భుతమైన పాత్రలు వేస్తూ.. తీరిక లేకుండా సినిమాలు చేస్తూ.. భారీ పారితోషకాలు తీసుకుంటూ.. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఒకలా కనిపించేవాడు ప్రకాష్ రాజ్. కానీ ఇప్పుడు తన ఫామ్ హౌస్ లో సేంద్రియ వ్యవసాయం చేసే ఒక రైతు కనిపిస్తున్నాడు. కొండారెడ్డి పల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ మంచి మంచి పనులు చేస్తున్న మానవతా వాది కనిపిస్తున్నాడు. అభిరుచి ఉన్న సినిమాలు చేస్తున్న మంచి దర్శకుడు కనిపిస్తున్నాడు. ఐతే ఈ పనులన్నీ చేయడం వెనుక ఎంత కష్టం దాగుందో.. ప్రకాష్ రాజ్ ఎంత విలక్షణమైన వ్యక్తో ఆయన మిత్రుడైన పూరి జగన్నాథ్ వెల్లడించాడు. మూడేళ్ల కిందట రాళ్లు రప్పలున్న చోటును ప్రకాష్ రాజ్ ఎలా మార్చాడో వివరించాడు.
‘‘మూడేళ్ల కిందట ప్రకాష్ రాజ్ హైదరాబాద్ శివార్లలో ఓ చోటికి తీసుకెళ్లాడు. అక్కడ పాతిక ఎకరాల భూమిని చూపించాడు. దీన్ని ఏదైనా చేయాలిరా అన్నాడు. అప్పుడ అక్కడ ఏమీ లేదు. తర్వాతి రోజు ప్రకాష్ అక్కడికి వెళ్లిపోయి రాత్రి మట్టిలోనే పడుకున్నాడు. తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ నన్ను ఆ చోటికి పిలిచాడు. వెళ్తే అక్కడ ఒక ఇల్లుంది. పక్కనే ఒక చెరువుంది. అందులో చేపలున్నాయి. చుట్టూ చెట్లు.. కూరగాయలు ఉన్నాయి. పక్షులు వచ్చి తిష్ట వేశాయి. రైతులు పనులు చేస్తున్నారు. ట్రాక్టర్లున్నాయి. ఇంకా చాలా కనిపించాయి. ప్రకాష్ రాజ్ ఎక్కడుంటే అక్కడ పచ్చదనం ఉంటుంది. ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఐతే దత్తత అంటే చెక్కు ఇచ్చేసి కూర్చోవడం కాదు. అక్కడికి వెళ్తాడు. రైతులతో మాట్లాడతాడు. పిల్లలతో కబుర్లు చెబుతాడు. స్కూలుకెళ్లి మాస్టార్లతో మాట్లాడతాడు. వాళ్లకేం సౌకర్యాలు కావాలో అడిగి ఏర్పాటు చేస్తాడు. సమస్యల మీద కలెక్టరును కలుస్తాడు. ఇంకా జనాలకు తెలియని చాలా పనులు చేస్తాడు. ఇంత బిజీగా ఉంటూ ఇన్ని పనులు ఎలా చేస్తాడో అర్థం కాదు’’ అని పూరి అన్నాడు.