Begin typing your search above and press return to search.

బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా?

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:41 PM GMT
బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా?
X
సాధారణంగా ఏ డైరెక్టర్ కయినా.. రైటర్ కయినా.. రోజులు గడిచే కొద్దీ పవర్ తగ్గుతూ ఉంటుంది. సంపాదించిన పేరుతో సక్సెస్ లు సొంతం చేసుకుంటున్నా.. మునుపు ఉన్నంత క్రియేటివిటీని కొత్తగా చూపించేయడం కష్టమే. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇలాంటి స్టేజ్ లోకి వెళ్లిపోయాననే విమర్శలు బాగానే వినిపించాయ్. కానీ కళ్యాణ్ రామ్ తో తీస్తున్న ఇజంతో తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వస్తున్న పూరీ.. తన మాటల్లో పవర్.. పెన్నులో పవర్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి చెప్పేస్తున్నాడు.

ఇజం టైటిల్ సాంగ్ ను పూరీ తనే పాడేశాడు. రైటర్ కూడా పూరీనే అనే సంగతి చెప్పకపోయినా తెలిసిపోతుంది. 'ఒకడ్ని మించినోడు ఒకడు.. సాలేగాళ్లు.. బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా.. సొసైట్ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. అన్నా.. కిసీ కో నై ఛోడ్ నా!' అంటూ పూరీ మాటలతో పాట సాగుతుంది. జర్నలిజం.. ఇజం ఇజం.. నిజం నిజం.. ఇది పేట్రియాటిజం అంటూ బీజీఎం థీమ్ వినిపిస్తూ ఉంటుంది.

బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా అనే డైలాగ్ లో పవర్ అర్ధం చేసుకోవడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఇలాంటి పంచ్ కేవలం పూరీ తప్ప వేరే ఎవరూ రాయలేరు అని ఘంటాపథంగా చెప్పేయచ్చు. 'చావండ్రా దేశం కోసం.. అంత కంటే గొప్ప పనే ముంది' లాంటి డైలాగ్స్ కూడా పేలడమే కాదు.. ఆలోచింపచేస్తాయ్ కూడా.