Begin typing your search above and press return to search.
హిందూ-ముస్లిం లవ్ స్టోరీ అంట
By: Tupaki Desk | 6 Sep 2017 4:52 AM GMTప్రేమ కథలు తీయడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టయిలే వేరు. పూరి ఫేమస్ అయిందే రొమాంటిక్ లవ్ స్టోరీలతోటి. అతడి సినిమాల్లో ఒక్క ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మాత్రమే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. మిగతా అన్ని సినిమాల్లోనూ మాస్ కు నచ్చే అంశాల చుట్టూనే ప్రేమకథను అల్లుకునేవాడు. పోకిరి నుంచి ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టెయినర్ లపైనే ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా కూడా అలాగే తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా మరోసారి బాలకృష్ణతో సినిమా తీస్తానని చెప్పాడు.
బాలకృష్ణతో మూవీ మొదలుపెట్టడానికి ముందు తన కొడుకును ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నాడు. ఇందుకోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. హిందూ - ముస్లిం ప్రేమకథతో ఈ సినిమా తీయనున్నాడు. మన దాయాది దేశమైన పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథను తెరకెక్కించబోతున్నాడు. సాధారణంగా ఇలాంటి సినిమాలు తీసేముందు ఆచితూచి జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మిగతా సినిమాల్లాగా నేనొక్కసారి కమిటైతే నామాట నేను వినను అన్న స్టయిల్లో పూరి ముందుకెళ్లిపోతే సెన్సార్ కత్తెరకు బలయిపోయే ప్రమాదమో.. వివాదాల్లో నలిగిపోయి నష్టపోవడమో జరుగుతుంది.
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఇప్పటికే హీరోగా టీనేజ్ లవ్ స్టోరీతో ఓ సినిమా చేశాడు. ఆంధ్రా పోరీ అనే పేరుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. అందుకే ఈసారి టైటిల్ నుంచే పూరి జగన్నాథ్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకునేది ఇంకా ఫైనల్ కాలేదు. దానిపై ఓ కంక్లూజన్ కు వస్తే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది.