Begin typing your search above and press return to search.

ఆ ఫ్యాన్ కు 101 ఫీవర్ వచ్చింది

By:  Tupaki Desk   |   12 Aug 2017 9:35 AM GMT
ఆ ఫ్యాన్ కు 101 ఫీవర్ వచ్చింది
X
తెలుగులో వచ్చే నెల వస్తున్న సినిమాలు అన్నీ ఆ హీరోలు కెరియర్ణి మరో మెట్టుకు తీసుకువెళ్లే సినిమాలే. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కానీ మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమా కానీ ఈ హీరో సినిమాలలో ఒక స్పెషల్ అనే చెప్పాలి. అలానే మరో సినిమా కూడా వస్తుంది. పూరీ జగన్నాధ్ డైరక్షన్లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సెప్టెంబర్‌ 1న విడుదల అవుతుంది. ఈ సినిమా క్రేజ్ మొదలిపెట్టిన దగ్గరనుండి పెరుగుతూ వస్తూ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తొలిసారిగా ఈ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి పని చేయడం ఈ క్రేజ్ కు అసలు కారణం. పూరీ మాటలను బాలయ్య ఎలా చెప్పాడు అనేది అందరి ఆసక్తి. అయితే ఈ మధ్య విడుదలైన 'స్టంపర్‌' మేకింగ్ వీడియో చూస్తే ఆసక్తి ఉండటంలో తప్పులేదు అనిపిస్తుంది. ఈ సినిమా తో పూరీ జై బాలయ్య అంటున్నాడు.

పైసా వసూల్‌ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ బాలయ్య నటనను దగ్గర నుంచి చూసి బాలయ్య నటనకు పెద్ద అభిమానిగా మారాడు అని చెబుతున్నాడు. పూరీ అభిమానాన్ని అతని మాటలోనే వినండి.. ”నేను ఇన్నిఏళ్లు బాలయ్య గురించి విన్నాను. ఇప్పుడు నా కళ్ళతో ఆయన నటిస్తుంటే చూశాను. బాలయ్యతో నేను ఎందుకు ఇంతవరకు సినిమా తీయలేకపోయానా అని ఇప్పుడు బాధపడుతున్నాను” అని చెప్పాడు. చెప్పడమే కాకుండా బాలయ్యలానే తన కూడా ఫోజ్ ఇచ్చి ఇలా తన వీర అభిమానాన్ని తెలుపుతున్నాడు. ఇందులో బాలకృష్ణ మాఫియా డాన్ లా కనిపించబోతున్నాడు. “నేను బాలయ్య ఫ్యాన్ని నాకు ఇప్పుడు 101 ఫీవర్ వచ్చింది” అని తన సినిమాను ప్రోమోట్ చేస్తూ దానిలో తన అభిమానం కూడా జత చేశాడు. బాలయ్య లాగే కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని స్టైల్ గా సిగరెట్ వెలిగించాడు. ఈ ఫోటో బట్టి మీకు ఊహించుకోవచ్చు బాలయ్య ఎంత స్టైలిష్ గా కనిపించనున్నాడో.

పైసా వసూల్ సినిమాతో తెలుగు సినిమాకు 'స్టంపర్‌' అనే సరికొత్త పదాన్ని పరిచయం అయ్యింది. యూట్యూబ్ లో ఇప్పుడు ఈ 'స్టంపర్‌' వీడియో వైరల్ అవుతుంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శ్రీయ శరణ్.. ముస్కాన్ సేథి.. కైరా దత్ నటిస్తున్నారు.