Begin typing your search above and press return to search.
పూరి వచ్చేశాడు.. మొదలెట్టేశాడు
By: Tupaki Desk | 8 July 2015 9:06 AM GMTమూడు రోజుల ముందు వరకు బ్యాంకాక్‌లో కూర్చుని చిరంజీవి 150వ సినిమాకు డైలాగులు రాసుకుంటున్నట్లు చెప్పాడు పూరి జగన్నాథుడు. ఆ పని ముగిసిందో లేదో కానీ.. ఇంతలోనే హైదరాబాద్‌కు వచ్చేశాడు. సడెన్‌గా వరుణ్‌తేజ్‌తో 'లోఫర్' సినిమాను మొదలుపెట్టేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఏ హడావుడి లేకుండా సింపుల్‌గా 'లోఫర్' ప్రారంభోత్సవం జరిగిపోయింది. పూరితో 'జ్యోతిలక్ష్మీ' తీసిన సి.కళ్యాణే ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో వరుణ్ సరసన ముంబయి మోడల్ దిశా పటాని కథానాయికగా నటించనుంది. టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో ఇడియట్, పోకిరి లాంటి నెగెటివ్ టైటిల్స్‌తోనే జనాల్ని మెప్పించిన పూరి.. ఈసారి ఇంకో అడుగు ముందుకేసి 'లోఫర్' అనే టైటిల్ పెట్టేశాడు. మరీ ఇంత నెగెటివ్ టైటిల్ ఏంటి అంటే సినిమా చూడండి మీకే తెలుస్తుంది అంటున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ క్యారెక్టర్ 'పోకిరి'లో పండుగాడి తరహాలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'జ్యోతిలక్ష్మీ' తరహాలోనే యమ స్పీడుగా ఈ సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు పూరి. రెండు నెలల్లో షూటింగ్ అవగొట్టేసి.. సెప్టెంబరు ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేసేయాలన్నది ప్లాన్ అట. ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు సమయానికి షూటింగ్ పూర్తి చేసి.. చిరు 150కి రెడీగా ఉండాలని పట్టుదలతో ఉన్నాడట పూరి.