Begin typing your search above and press return to search.
బాలయ్య మూవీకి పూరీ ప్యాకేజ్ ఎంత?
By: Tupaki Desk | 1 Jun 2017 4:42 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ అందరూ 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. పూరీ జగన్నాధ్ అయితే.. ఈ మార్క్ ను ఎప్పుడో అందుకున్నాడు. ఇప్పుడు ఫ్లాప్ ల కారణంగా కాసింత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా.. పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
పూరీ జగన్నాధ్ గత చిత్రం రోగ్. ఈ మూవీకి గాను పూరీకి మొత్తంగా 17 కోట్ల రూపాయలు ముట్టాయనే విషయం ఇప్పుడు బాగా హైలైట్ అవుతోంది. ఇందులో ట్రాన్స్ పోర్ట్ తో పాటు.. పూరీ కనెక్ట్స్ తో కాస్టింగ్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా కలిపి ఉంటాయట. అయితే.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు పూరీ. ఈ మూవీని కంప్లీట్ గా ప్యాకేజ్ రూపంలోనే తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారట. ఇందులో బాలయ్య రెమ్యూనరేషన్ 10 కోట్లు అంటున్నారు.
అంటే మిగిలిన పాతిక కోట్లలో ఎంత మొత్తం ఖర్చుతో బాలయ్య 101ను పూరీ పూర్తి చేస్తాడన్నదే పాయింట్. మరీ రోగ్ టైపులో 17 కోట్ల మేర గిట్టుబాటు కాకపోయినా.. కనీసం 10 నుంచి 12 కోట్ల మేర పూరీకి దక్కనున్నాయని తెలుస్తోంది. ఒకట్రెండు పాటలు మినహా మిగతా అంతా ఒరిజినల్ లొకేషన్స్ లోనే తీసేయడం.. ఫైట్స్ కోసం కూడా సెట్ ప్రాపర్టీస్ ను తక్కువగా వాడడం పూరీకి అలవాటు. వరుస ఫ్లాప్స్ మధ్య కూడా మినిమం 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే.. దటీజ్ పూరీ అనాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/