Begin typing your search above and press return to search.
పూరి పేమెంట్ ప్యాకేజ్ అదిరింది
By: Tupaki Desk | 17 Aug 2016 4:57 AM GMTదర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న మాట ఒప్పుకోవాల్సిందే. వరుసగా సినిమాలు పల్టీ కొట్టడంతో పూరీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. సిట్యుయేషన్ ఎలా ఉన్నా పూరీ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు తీస్తున్న ఇజం చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలిసి చాలా మంది.. పూరీ పేమెంట్ ప్యాకేజీ అదిరింది అంటున్నారు.
కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది దర్శకుడు ఆలోచన. అయితే.. ఈ సినిమా కోసం పూరీ పారితోషికంగా 8 కోట్లు పుచ్చుకున్నాడట. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మొత్తం బడ్జెట్ 20 కోట్లు అని అంటున్నారు. అంటే పూరీకిచ్చే 8 పోగా.. మిగిలిన 12లోనే ఇతర నటీనటులు.. టెక్నీషియన్లు.. ప్రొడక్షన్ కాస్ట్ ఉంటాయన్న మాట.
రీసెంట్ టైమ్ లో ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ కి మినహాయిస్తే.. పూరీ సినిమాల్లో ఏదీ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. టెంపర్ కూడా ఈ దర్శకుడి రేంజ్ హిట్ ఏమీ కాదు. అయినా సరే.. రూపాయి కూడా తగ్గకుండా తన రెమ్యూనరేషన్ 8 కోట్లను తాను అందుకోగలిగాడంటే.. నిజంగా పూరీకి సలాం అనాల్సిందే అన్నది ఫిలిం నగర్ టాక్.