Begin typing your search above and press return to search.
మెహబూబాకి మీ అవసరం ఉంది -పూరి
By: Tupaki Desk | 15 May 2018 2:04 PM GMTఎప్పుడు కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపే పూరి జగన్నాథ్ ఈమధ్య రూటు మార్చాడు. హిట్లు లేకపోవడంతో ఒకరకంగా పూరి చాలా డీలా పడిపోయాడు. ఎలాగైనా తను ఫార్మ్ లోకి రావాలని, తన కొడుకుకి కూడా ఒక మంచి లాంచ్ ఇవ్వాలని బోలెడు కలలతో మెహబూబా సినిమా తీశాడు. ఇది ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. ఈ సినిమా ఈమధ్యనే విడుదల అవ్వగా పూరి సక్సెస్ మీట్ కుడా పెట్టేశాడు.
సినిమా హిట్ కాకపోగా కొన్ని నెగటివ్ రివ్యూలు కూడా అందుకుంది. సక్సెస్ మీట్ లో పూరి మాట్లాడుతూ "ఒకవేళ నేను ఓకేలాంటి మసాలా సినిమాలు తీస్తుంటే నేను అలాంటి సినిమాలే చేస్తున్నాను అంటారు. ఇప్పుడు నేను రూటు మార్చి కొత్తగా ట్రై చేస్తే పూరి మార్క్ మిస్ అయింది అంటున్నారు" అంటూ వాపోయాడు ఈ పోకిరి దర్శకుడు. తను మొట్టమొదట సారిగా కామెడీ - ఐటమ్ సాంగ్స్ లేకుండా ఇలాంటి జెన్యూన్ ప్రేమ కథ తీశానని, ఇది తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చాడు. "రివ్యూలు ఎలా రాసినా ఆకాష్ యాక్టింగ్ గురించి బాగా రాశారు. యుఎస్ లోను మరియు ఇక్కడ కూడా ఆడియన్స్ తో సినిమా చూసినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఇప్పుడు మెహబూబా కి మీ ఆదరణ కావాలి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు పూరి.
సినిమా అంతంతమాత్రంగా ఉన్నపుడు దానిని ఆదరించాలి అని పూరి ఎంత అడిగితే మాత్రం ఏమవుతుంది. అయినా సినిమా బావుంటే చూస్తారు కానీ దర్శకులు అడిగితే చూస్తారా ప్రేక్షకులు? అలాగే బాగున్న సినిమాకు బ్యాడ్ రివ్యూలు ఇచ్చినా జనాలు చూడకుండా మానేయరు. కాబట్టి చూద్దాం పూరి రిక్వెస్టును ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో!!