Begin typing your search above and press return to search.
చిన్న పిల్లాడ్ని పవన్ మీద వేస్తున్నాడే
By: Tupaki Desk | 22 March 2017 8:21 AM GMTఒక ప్రక్కన మన్నారా చోప్రా.. మరో ప్రక్కన ఏంజెలా క్రిసిలింజికీల గ్లామర్ తో ''రోగ్'' సినిమా అట్టుడికి పోతోంది. అయితే ఆ హాట్నెస్ ఒక్కటే సినిమాను ఆడించడానికి అస్సలు సరిపోదు. సినిమాలో చాలా కంటెంట్ ఉండాలి. మరి దర్శకుడు పూరి జగన్ ఆ యాంగిల్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో తెలియదు కాని.. ఇప్పుడు సినిమాను మాత్రం కాస్త రిస్కీ టైములోనే రిలీజ్ చేస్తున్నాడు.
మార్చి 24న కాటమరాయుడు సినిమా వస్తున్నందున.. సరిగ్గా రెండు వారాల గ్యాపిచ్చేసి ఏప్రియల్ రెండో వారం నుండి ఇతర సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నాయి. చెలియా.. గురు.. మిష్టర్ వంటి సినిమాలన్నీ ఏప్రియల్ 2వ - 3వ వారాల్లో రావడానికి సన్నద్దమవుతున్నాయి. ఇక గురు సినిమా అయితే ఎలాగో కొన్ని పెద్ద సినిమాలు డ్రాప్ అయ్యాయ్ కాబట్టి.. మార్చి నెలాఖరుకే రావాలని అనుకుంటున్నాడట. అయితే పవన్ దాటిని తట్టుకుని.. ఎలాగైనా విన్నర్ గా ఒడ్డుకు చేరుకోవాలని.. పూరి జగన్ కూడా ''రోగ్'' సినిమాను మార్చి 29న రంగంలోకి దించుతున్నాడు. ఇషాన్ అనే కొత్త కుర్రాడు హీరోగా వస్తున్న ఒక సినిమాను ఇలా పవన్ వంటి స్టార్ పై పోటీకి పెట్టడం ఎంతవరకు భావ్యం పూరి?
నిజానికి పూరి జగన్ తన సినిమా మీద ప్రేమతోనో.. లేదా కొత్త కుర్రాడి మీద కాన్ఫిడెన్స్ తోనో ఇలా పవన్ కాటమరాయుడికి పోటీగా రోగ్ ను దించట్లేదట. మనోడికి బాలయ్యతో చేయాల్సిన 101వ సినిమా తాలూకు షూటింగ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. అందుకే ఆ సినిమా మొదలయ్యేలోపే ఇప్పుడు రోగ్ ను రిలీజ్ చేసేస్తే.. తాను రిలీఫ్ గా ఉండొచ్చని మనోడు ఇలా తొందరపడి తన కోయిలతో ముందే కూయిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే కొందరికి.. బాలయ్య సినిమా కోసం బాలుడ్ని బలి చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తోంది. ప్చ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/