Begin typing your search above and press return to search.

మీకు పవర్‌ స్టారే.. నాకు దేవుడు!!

By:  Tupaki Desk   |   15 Dec 2015 3:56 AM GMT
మీకు పవర్‌ స్టారే.. నాకు దేవుడు!!
X
''మీకు పవన్‌ కళ్యాన్‌ కేవలం ఒక పవర్‌ స్టారే. నాకు మాత్రం పవన్‌ కళ్యాణ్‌ దేవుడు'' అనేశాడు పూరి జగన్‌. విజయవాడలో జరిగిన ''లోఫర్'' ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ లో ఈ మాటలన్నాడు డ్యాషింగ్‌ డైరక్టర్‌.

''ఇలా పిచ్చి పిచ్చిగా అరిచి న్యూసెన్స్ చేసే ఫ్యాన్స్‌ రేపు వరుణ్‌ కు కూడా తయారవ్వబోతున్నారు. మొన్న చిరంజీవి గారిని కలిసినప్పుడు వరుణ్‌ గురించి 10 నిమిషాలు మాట్లాడారు. తల్లి సెంటిమెంట్‌ వరుణ్‌ కుమ్మేశాడని ఆయనే కాంప్లిమెంట్‌ ఇచ్చారు. పునాదిరాళ్ల దగ్గర నుండి ఏ సినిమా అయినా.. సినిమా ఫెయిల్‌ అయ్యుండొచ్చు.. దర్శకుడు రైటర్లు టీమ్‌ అంతా ఫెయిల్‌ అవ్వొచ్చు. కాని చిరంజీవి గారు మాత్రం ఫెయిల్‌ కాలేదు. ఆయన యాక్టింగ్‌ ఎప్పుడూ టాపే. సేమ్‌ రేపు వరుణ్‌ కూడా అలాంటి స్టారే అవ్వబోతున్నాడు. మెగా ఫ్యామిలీ గర్వపడతారు'' అని చెప్పుకొచ్చాడు పూరి జగన్‌.

అయితే ఫ్యాన్స్‌ జై పవర్‌ స్టార్‌.. జైజై పవర్‌ స్టార్‌.. అంటూ రచ్చ రచ్చ చేసిపాడేస్తున్నప్పుడు పవన్‌ గురించి ఆ దేవుడు కామెంట్‌ చేశాడు పూరి. మరి పూరి జగన్‌ నిజంగానే పవన్‌ నా దేవుడు అని చెప్పాడా లేకపోతే ప్రభాస్‌ తరహాలో అభిమానుల గోల తట్టుకోలేక 'ఐ లవ్‌ పవర్‌ స్టార్‌' అన్నట్లు ఈ కామెంట్‌ చేశాడా అనే విషయం మాత్రం తెలియదు.