Begin typing your search above and press return to search.
జస్ట్ ఆస్కింగ్.. గురువు మీదే సైటైరా పూరీ?
By: Tupaki Desk | 17 Dec 2015 10:36 AM GMTపవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ కదా.. మరి ట్విట్టర్ లో అతణ్ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య అంత తక్కువుందేంటి.. అని టైప్ చేసేసి చివర్లో ‘జస్ట్ ఆస్కింగ్’ అని ట్యాగ్ తగిలిస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎవరిపైన అయినా సెటైర్లు వేయాలనుకున్నపుడు చివర్లో ఇలా అమాయకంగా ‘జస్ట్ ఆస్కింగ్’ అని ట్యాగ్ జత చేయడం వర్మకు అలవాటు. ట్విట్టర్ లో వర్మను ఫాలో అయ్యేవారికి ఈ పదం బాగా అలవాటే. ఐతే వేరే వాళ్లపై వర్మ సెటైర్లు వేయడానికి వర్మ వాడే మాటనే పట్టుకుని.. ఇప్పుడు అతడి మీద శిష్యుడు పూరి జగన్నాథే సెటైర్లు వేసేశాడు. లోఫర్ సినిమాలో ‘జస్ట్ ఆస్కింగ్’ అనే మాటను బాగా వాడేసుకున్నాడు పూరి.
ఐదు నిమిషాలే కనిపించే బ్రహ్మి పాత్రకు ‘జస్ట్ ఆస్కింగ్’ అనే మాటనే ఊతపదంగా వాడాడు పూరి. తొలి సన్నివేశంలోనే.. ‘‘నిన్నేమైనా ఊరకుక్క కరిచిందా.. జస్ట్ ఆస్కింగ్’ అంటాడు బ్రహ్మి. ఆ తర్వాత కూడా ఈ పదాన్ని రెండు మూడుసార్లు వాడాడు. బ్రహ్మి నొక్కి పట్టి మరీ ఈ మాట అనడం చూస్తే గురువునుద్దేశించి కావాలనే పూరి ఈ మాటను వాడుకున్నట్లు అర్థమైపోతుంది. ఇంతకుముందు అమీర్ ఖాన్ మీద వర్మ సెటైర్లు వేయడం.. ఆపై పూరి అమీర్ ను విమర్శించే వాళ్లందరూ యూజ్ లెస్ ఫెలోస్ అనడం గుర్తుండే ఉంటుంది. అది చూసి గురుశిష్యుల మధ్య ఏమైనా విభేదాలొచ్చాయేమో అనుకున్నారు జనాలు. కానీ ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్ లో వాళ్లిద్దరి బంధం ఎంత స్ట్రాంగో అర్థమైంది. ‘లోఫర్’ సినిమాలో ‘జస్ట్ ఆస్కింగ్’ అనే మాట కూడా పూరి సరదాగా అలా వాడుకున్నాడేమో.