Begin typing your search above and press return to search.
మెహబూబా కోసం ఛలో ఫార్ములా
By: Tupaki Desk | 17 Feb 2018 5:25 AM GMTప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లానింగ్స్ వేయడంలో మన సినిమా వాళ్లు బాగా రాటు దేలారు. ఎలాంటి సినిమా అయినా ప్రమోషన్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుందని వారికి బాగా తెలిసొచ్చింది. అందులోనే కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఎక్కువగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. కాలేజ్ లో మంచి టాక్ ని సెట్ చేస్తే గాసిప్ లాగా అందరికి పాకుతుందని ఆలోచించారేమో గాని యూనివర్సిటీలలో ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టారు.
రీసెంట్ గా నాగ శౌర్య హీరోగా చేసిన ఛలో చిత్ర యూనిట్ ఎక్కువగా కాలేజీలలో ప్రమోషన్స్ నిర్వహించారు. అది వారికి చాలా ప్లస్ అయ్యింది. ఆ తరువాత సినిమా రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఛలో వైరల్ అయ్యింది. ఇక రిలీజ్ తరువాత సినిమాకు మంచి టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆ ఫార్ములాను మెహబూబా టీమ్ కూడా ఉపయోగిస్తోంది.
పూరి జగన్నాథ్ ఈ సినిమాను చాలా కష్టపడి తీశాడు. ఎలాగైనా హిట్ అవ్వాలని ప్రమోషన్స్ జోరును పెంచాడు. రీసెంట్ గా యూనివర్సిటీలో చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ బాగానే చేశాడు. హీరో ఆకాష్ హీరోయిన్ నేహా ఇంకా ఛార్మి తదితరులు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. మరి ఛలో సినిమాకు వర్కౌట్ అయినట్టుగా మెహబూబాకి కాలేజ్ ప్రమోషన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.