Begin typing your search above and press return to search.
హీరోయిన్లు పెళ్లాడకూడదన్న పూరి లాజిక్
By: Tupaki Desk | 17 Jun 2021 12:30 PM GMTమూస ధోరణిలో బతికేయడం సామాజిక కట్టుబాట్లతో ముందుకు సాగడం అనేది కొందరికి గిట్టని వ్యవహారం. ఇక పూరి మ్యూజింగ్స్ లో తాజాగా పూరి చెప్పిన సింగిల్ బై ఛాయిస్ కాన్సెప్ట్ విభిన్న ధోరణిని పరిచయం చేస్తోంది.
ఇక సినిమా కథానాయికలు అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుంటే తనకు నచ్చదని పూరి అన్నారు. నటి కావడం అన్నది ఎవరికో దక్కే అదృష్టం. అలాంటి వాళ్లు కూడా పిల్లల్ని కంటే తనకు నచ్చదని.. హీరోయిన్స్ ని తమ అభిమానులు దేవతల్లా చూస్తారని.. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేనని అన్నారు.
అలాగే దేవతలు కూడా పిల్లల్ని కనలేదని.. స్వర్గంలో రంభ ఊర్వశి మేనక కూడా పెళ్లాడి పిల్లల్ని కనలేదని అన్నారు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు మాత్రమే .. కానీ మీరు కూడా దేవతల్లా ఉంటే మాకు ఇష్టం అని పూరి అన్నారు. కథానాయికలు సాధారణ అమ్మాయిలతో పోలిస్తే బలమైన ఆలోచనలతో ఉంటారు. వీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా.. ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? అని ఆయన ప్రశ్నించారు. జయలలిత- మాయావతి- మమతాబెనర్జీ.. వీళ్లంతా ఎందరికో స్ఫూర్తి. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు.. అన్నారు.
పురాణాల్లోనూ సింగిల్ ఉమన్ ఉన్నారు. హాలీవుడ్ కథానాయికలు పెళ్లాడరు.. హీరోయిన్స్ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్ ఉమెన్ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు అని పూరీ అన్నారు. పూరి తనలోని ఫెమినిజం భావజాలానికి కొత్త కోణాన్ని జోడించి బాగానే చెప్పారు. అసలు పెళ్లాడక పోతే కలిగే అనర్థాల గురించి కూడా ఒకరోజు పూరి చెబుతారేమో!!