Begin typing your search above and press return to search.

ముంబై నుంచి మకాం మారుస్తున్న పూరీ..? నెక్స్ట్ ఏంటంటే..?

By:  Tupaki Desk   |   7 Sep 2022 1:30 PM GMT
ముంబై నుంచి మకాం మారుస్తున్న పూరీ..? నెక్స్ట్ ఏంటంటే..?
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ “లైగర్” సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూశాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. మార్నింగ్ షోల నుండే డిజాస్టర్‌ గా ప్రకటించబడింది. ఇలాంటి పేలవమైన కంటెంట్ ను అందించినందుకు ప్రేక్షకులు దర్శక రచయిత పూరీని తీవ్రంగా విమర్శించారు.

'లైగర్' ప్లాప్ తో ఓవర్ నైట్ లో పూరీ అదృష్టం మారిపోయింది. సోషల్ మీడియాలో ఎన్నడూ లేనంత నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయ్ తో లాంచ్ చేసిన తన తదుపరి ప్రాజెక్ట్ 'జన గణ మన' (JGM) కూడా నిలిపివేయబడిందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో గత మూడేళ్ళుగా ముంబైలో తన కార్యకలాపాలను సాగించిన పూరీ జగన్నాథ్.. అక్కడ అద్దెకు తీసుకున్న విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ముంబై ప్రణాళికలు దెబ్బతినడంతో తిరిగి హైదరాబాద్ రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇకపై కొంతకాలం జూబ్లీహిల్స్‌ లోని తన 'కేవ్' నుంచే కార్యకలాపాలు సాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పూరీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఏ హీరో డాషింగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

పూరితో సినిమా చేయడానికి టాప్ స్టార్స్ ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. టైర్-2 హీరోలు సినిమా చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు. 'JGM' ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టారు కాబట్టి.. 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్‌ పనులు ప్రారంభిస్తారని ఊహాగానాలు ఉన్నాయి.

కాకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను తో కలిసి పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్ పోతినేని.. మళ్లీ పూరీతో సినిమా చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ బయటకు వచ్చింది.

'మెహబూబా' సినిమాతో పూర్తి స్థాయిలో హీరోగా మారిన ఆకాష్.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు తనయుడిని హీరోగా స్థిరపరచవలసిన బాధ్యత పూరీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ఆకాష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దృష్టి సారించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే 'లైగర్' డిజాస్టర్ అయినప్పటికీ శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మొత్తం రాబట్టారు. ఈ విధంగా చూసుకుంటే పూరీ కి ఆర్థిక నష్టం జరగలేదనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాతో సంబంధం ఉన్న చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు నష్టపోయారు. పరిహారం కోసం దర్శకుడిని కలవడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. పూరీ సైతం అందరికీ 30 శాతం సెటిల్ చేయాలని నిర్ణయించుకున్నారని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.