Begin typing your search above and press return to search.

#పూరి మ్యూజింగ్స్.. 65 దేశాల్లో 152 ఎపిసోడ్ల‌తో..

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:00 PM GMT
#పూరి మ్యూజింగ్స్.. 65 దేశాల్లో 152 ఎపిసోడ్ల‌తో..
X
స్టార్ డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. వెండితెర‌పై ఆయ‌న పంచ్ ల‌కు ఉండే క్రేజు అంతా ఇంతా కాదు. హైఎన‌ర్జీతో పంచ్ డైలాగ్ రైట‌ర్ గా ఆయ‌న ది బెస్ట్ యూత్ ఫుల్ రైట‌ర్ అని ప్రూవ్ చేశారు. ఆయ‌న‌ ఇటీవ‌ల `పూరి మ్యూజింగ్స్` పేరుతో ఎన్నో హిడెన్ సంగ‌తుల్ని `మాటల‌ రూపకంగా`నే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌న అభిమానుల‌కు చెబుతున్నారు. ఆయ‌న మాట తీరు .. సూటిగా ఉండే వ‌చ‌నం అంద‌రి బుర్ర‌ల‌కు జోరుగా ఎక్కేస్తుండ‌డంతో పూరి మ్యూజింగ్స్ ఎపిసోడ్స్ సంచ‌ల‌నంగా నిలుస్తున్నాయి.

టాప్ 2020 పాడ్ కాస్ట‌ర్ గా క్రెడిట్ పూరీకే ద‌క్కుతుంది. ప్ర‌ఖ్యాత స్పోటిఫై ఇండియా లో పూరి మ్యూజింగ్స్ టెలీ కాస్ట్ అయ్యాయి ఇవ‌న్నీ. పూరి మ్యూజింగ్స్ 65 దేశాల్లో 540 నిమిషాల‌తో 152 ఎపిసోడ్స్ వైర‌ల్ అయ్యాయి. మూడు దేశాల్లో 104రోజుల పాటు చార్ట్స్ లో టాప్ పొజిష‌న్ లో నిలిచాయి. అలాగే 68193 మంది ప్ర‌జ‌లు వీటిని విన్నారు. ఏ ఇత‌ర పాడ్ కాస్ట్ తో పోల్చినా ఇదే బెస్ట్. ఆ మేర‌కు పూరి కనెక్ట్స్ త‌ర‌పున వివ‌రాలందించారు.

మ‌రోవైపు పూరి ఫైట‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ‌కోసం వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ పీరియ‌డ్ లో స్క్రిప్ట్ బెట‌ర్ మెంట్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అలాగే త‌న శిష్యుల‌కు వెబ్ సిరీస్ స్క్రిప్టుల్ని అందించి వాటిని స్వ‌యంగా నిర్మిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.