Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాలో పిడ‌క‌లు త‌గ్గాలంటే ఆధార్ యాడ్ చేయాలన్న పూరి

By:  Tupaki Desk   |   1 Jun 2021 10:30 AM GMT
సోష‌ల్ మీడియాలో పిడ‌క‌లు త‌గ్గాలంటే ఆధార్ యాడ్ చేయాలన్న పూరి
X
రేష‌న్ - పెన్ష‌న్ - బ్యాంక్ అకౌంట్ .. ఇలా ప్ర‌తిదీ ఆధార్ తో లింక‌ప్ అయ్యి ఉన్నాయి. కానీ సోష‌ల్ మీడియా ఎందుక‌ని ఆధార్ తో అనుసంధానం కాలేదు. అక్క‌డ అంద‌రినీ ఆధార్ తో యాడ్ చేసి లాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి బ్ర‌హ్మాండ‌మైన ఐడియా ఎవ‌రికి వ‌చ్చిందో తెలుసా? ది గ్రేట్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కి ఇలాంటి చిలిపి ఐడియా వ‌చ్చింది. పూరి మ్యూజింగ్స్ లో ఈ చిట్కా చెప్పారు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేయ‌డం ఖాయం.

ఇటీవ‌లే మ‌ద‌ర్ థెరిస్సా మాట్లాడుతున్న యూట్యూబ్ వీడియోకి 1000 లైక్ లు వ‌స్తే 10000 డిస్ లైక్స్ వ‌చ్చాయ‌ట‌. దీంతో పూరీకి ఈ చిలిపి ఆలోచ‌న వ‌చ్చింది. మ‌ద‌ర్ థెరిసా మాట్లాడినా డిస్ లైక్ లేనా.. మ‌న‌మంతా సోష‌ల్ మీడియా అనే పెం... మీద కూచుకున్నాం. అక్క‌డ ఒక‌రిమీద ఒక‌రు పేడ వేస్తాం. పిడ‌క‌లు త‌గ్గాలంటే సోష‌ల్ మీడియాలో చేరిన వారిని ఆధార్ తో లింక‌ప్ చేసేలా ప్ర‌భుత్వం రూల్ తేవాలి.. అని పూరి అన్నారు. అప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడ‌తార‌ని అన‌వ‌స‌ర కామెంట్లు చేసేవాళ్లు త‌గ్గుతార‌ని అన్నారు.

బావుంది పూరీ స‌ర్!.. ఇప్ప‌టికే వాట్సాప్- ఫేస్ బుక్ లాంటి చోట ప్రైవ‌సీ లేక జ‌నం ఎలాంటి సీక్రెట్ లీకైపోతుందోన‌ని కంటికి కునుకు కరువై ఉన్నారు. ఎప్పుడు ఎలా ఎవ‌రి వ‌ల్ల‌ మోసానికి గుర‌వుతామోన‌ని బెంబేలెత్తుతున్నారు. ఎట్నుంచి ఏ ముప్పు వ‌స్తుందో .. ఎట్నుంచి ఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కామ్ బ‌య‌ట‌ప‌డుతుందో.. ఏ బ్యాంక్ ఖాతా నుంచి డ‌బ్బు ఎటు మాయ‌మైపోతుందో? పుట్టి ఎలా మునిగిపోతుందో? అంటూ భ‌య‌ప‌డిపోతున్నారంతా. దీనిపై వ‌ర‌ల్డ్ వైడ్ డిబేట్ కూడా ర‌న్ అవుతున్నాయి. ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో ఆధార్ వివ‌రాలిచ్చేస్తే ఇక మామూలుగా ఉంటుందా బ‌డితె పూజ‌!! కేవ‌లం ఆధార్ నంబ‌ర్లు ఫోన్ నంబ‌ర్లు కొట్టేసి కేటుగాళ్లు కోట్లు కొల్ల‌గొట్టేస్తుంటే.. ఇప్పుడు అధికారికంగానే గుట్టంతా ఇచ్చేయ‌మంటే ఎలా సార్?