Begin typing your search above and press return to search.

పూరీ ఐడియాల‌జీని ఎక్కువ మందికి చేరుస్తున్న 'పూరీ మ్యూజింగ్స్' కొత్త సిరీస్..!

By:  Tupaki Desk   |   18 May 2021 2:30 PM GMT
పూరీ ఐడియాల‌జీని ఎక్కువ మందికి చేరుస్తున్న పూరీ మ్యూజింగ్స్ కొత్త సిరీస్..!
X
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ లో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో తన అనుభవాలు ఆలోచనలను ఆడియో రూపంలో వినిపిస్తున్నాడు. 'మనీ - సింప్లిసిటీ - ఫారెస్ట్ - స్ట్రగులింగ్ డేస్ - సేల్స్ బాయ్ - ధేడ్ దిమాక్ - బుద్ధ - రైల్వే స్టేషన్ - మదర్ - హ్యూమానిటీ - సోషల్ మీడియా - మ్యారేజ్.. ఇలా అన్ని టాపిక్స్ ని ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉంచాడు. ఈ ఆడియోలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా విశేష స్పందన తెచ్చుకుంటున్నాయి.

అయితే ఆ మధ్య పోడ్ కాస్ట్ లను పోస్ట్ చేయడం ఆపేసిన పూరీ.. మళ్ళీ 'పూరీ మ్యూజింగ్స్' తో సందడి చేస్తున్నారు. మొదట్లో తెలుగు ప్రేక్షకుల కోసమే పోడ్ కాస్ట్ ని పరిమితం చేసిన పూరీ.. ఇప్పుడు కొత్త సిరీస్ పాడ్ కాస్ట్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంచాడు. వీటికి మొదటి సిరీస్ ఆడియోల కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండటంతో వ్యూయర్ షిప్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా పూరీ 'ఎమర్జెన్సీ ఫుడ్‌' టాపిక్ మీద 'పూరీ మ్యూజింగ్స్‌' లో మాట్లాడారు. ''వరదలు రావొచ్చు.. యుద్ధాలు రావొచ్చు.. సునామీలో చిక్కుకుపోవచ్చు.. ప్రస్తుతం మనం చూస్తున్న ఇలాంటి విపత్తు లాంటిది ఏదో ఒకటి వచ్చి లాక్‌ డౌన్‌ పెట్టొచ్చు. ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్‌ పోవచ్చు. అడవికి వెళ్లినప్పుడు వాహనం పాడైపోయి మధ్యలో మీరు ఇరుక్కుపోవచ్చు. అలాంటి సమయంలో మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం ఎమర్జెన్సీ ఫుడ్ సిద్ధం చేశారు''

''ఒక డబ్బాలో ఫుడ్‌ ప్యాకెట్స్‌ సిద్ధంగా ఉంటాయి. కేవలం ఒక కప్పు వేడి నీళ్లు కలిపి ఆ ఆహారాన్ని తినేయవచ్చు. వండాల్సిన అవసరం లేదు. బ్రేక్‌ ఫాస్ట్‌, లంఛ్‌, డిన్నర్‌ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్‌ ప్యాకెట్స్‌ తో బకెట్స్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే రెండు రోజులకు సరిపడే ఫుడ్‌ ప్యాకెట్స్‌ కూడా దొరుకుతాయి. బార్లీ, కినోవా, ఓట్స్‌, న్యూడిల్స్‌, పాస్తా లాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ కనుక.. ఒక బకెట్‌ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పాతికేళ్లలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు'' అని పూరీ జగన్నాథ్ వివరించారు.