Begin typing your search above and press return to search.

డేంజరస్‌ గా బతకాలని చెప్తున్న పూరీ..!

By:  Tupaki Desk   |   31 May 2021 4:30 PM GMT
డేంజరస్‌ గా బతకాలని చెప్తున్న పూరీ..!
X
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలను అందరితో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో అందరినీ ఆకట్టుకుంటున్న పూరీ.. సబ్ టైటిల్స్ తో సరికొత్త సెకండ్ సిరీస్ తో వచ్చాడు. తాజాగా 'లివ్‌ డేంజరస్లీ' అనే అంశం గురించి మాట్లాడారు. జీవితంలో రిస్క్‌ తీసుకోవాలని.. రిస్క్‌ లోకి దూకడమే మన క్యారెక్టర్‌ అవ్వాలని.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని.. సవాళ్లు ఎదుర్కొవాలని పూరీ చెబుతున్నారు. ‘లివ్‌ డేంజరస్లీ' గురించి పూరీ ఏమి చెప్పాడంటే..

''లివింగ్‌ డేంజరస్లీ ఈజ్‌ ది ఓన్లీ వే అని ఓషో లాంటి చాలా మంది చెప్పారు. రిస్క్ లేని జీవితాన్ని కోరుకోవద్దు. సెక్యురిటీ ఇవ్వమని జీవితాన్ని అడగవద్దు. ఎలాంటి ఎత్తుపల్లాలు లేని మైదానంలో బతకాలని అనుకుంటారు అందరూ. కానీ, జీవితంలో ఎత్తైన కొండలు, పర్వతాలు లోయలు అనేవి ఉండాలి. రిస్క్‌ తీసుకోవడం.. రిస్క్‌ లోకి దూకడమే మన క్యారెక్టర్‌ అవ్వాలి. చేసే పనులెప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోరింగ్‌ గా ఉంటుంది''

''జీవితమనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించేద్దాం. అటు నుంచి మాత్రమే ఎందుకు కాల్చాలి. ఇటునుంచి కాల్చకూడదా అనే ఆలోచనా విధానం మనిషికి అవసరం. స్కై డైవింగ్ భయమైతే అదే చేసేయ్. ఎన్నిసార్లు దువ్వుతావ్ అదే హెయిర్ స్టైల్ ని. ఒకసారి గుండు గీసి చూడు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ వేయని బట్టలు వేసుకో. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని రోడ్ మీద నిలబడు. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసి ట్రావెల్ కి బయల్దేరు. తక్కువ డబ్బుతో ఎలా బ్రతకాలో నేర్చుకో"

''నీకు ఇష్టమైంది చేసేయ్. ఇష్టంగా చేసేయ్. ఏదైతే అది అవుద్ది. తర్వాత చూసుకుందాం. రేపు చచ్చిపోతాను అనుకొని ఈరోజు ఎలా బ్రతకాలో అలా బతికేయి. జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడొద్దు. జీవితం అనే పోటీలో పాల్గొనాలి. బాగా తిను. ఆరోగ్యంగా ఉండు. రెండు రోజులు నిన్ను నువ్వు పొగుడుకోవడం మానేయి. టాలెంటెడ్ పీపుల్ ని అభినందించు. జీవితమంటే మనం ఒక్కరం మాత్రమే కాదు. మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్లందర్నీ చూడు.. వాళ్లకంటే డేంజరేస్‌ గా ఏదైనా చేయగలవేమో ఆలోచించు''

''ఒక్కసారి ప్రయత్నించి చూడు. కొన్ని నీకు చేత కాదు అని నీకు తెలియాలి. పరుగెత్తు. కూడా ఓ కుక్కని తీసుకొని పరుగెత్తు. భయం దెయ్యం లాంటిది. అది చెప్పినట్లు అస్సలు వినొద్దు. ఆశల్ని, కలల్ని, ఫాలో అయిపో. కాసేపు ప్రేమించడం మానేయి. నీకు ఎవరూ లేరనుకో. నువ్వు అనాధవి అనుకో. లైఫ్ అంటేనే ఎన్నో సాహసాలతో కూడుకున్నది. బతికితే డేంజరస్‌ గానే బతకాలి. మొనాటనస్ లైఫ్ మనకొద్దు. లివ్‌ డేంజరస్లీ'' అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.