Begin typing your search above and press return to search.
మహేష్ - పూరి కోల్డ్ వార్ నిజమే...!
By: Tupaki Desk | 28 April 2020 3:30 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ మరియు మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ లో సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మహేష్ బాబులోని కొత్త యాంగిల్ ను పూరీ జగన్నాథ్ ఆవిష్కరించాడని చెప్పవచ్చు. పండుగాడుగా మహేష్ బాబు చెప్పిన 'ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు..' 'నేను ఎంత ఎదవనో నాకే తెలియదు' లాంటి డైలాగులు ఇప్పటి ప్రేక్షకులు మదిలో కూడా అలాగే ఉన్నాయి. ఈ చిత్రం 'ప్రిన్స్' మహేష్ బాబును 'సూపర్ స్టార్' మహేష్ బాబుగా మార్చింది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా 'పోకిరి' రికార్డులకు ఎక్కింది. ‘పోకిరి’ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇన్ని రికార్డులను క్రియేట్ చేసిన మహేష్ - పూరీల మధ్య ఆ తర్వాత రోజుల్లో కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని అందరూ చెప్పుకున్నారు.
మహేష్ బాబు - పూరి జగన్నాథ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని మాట్లాడుకోవడమే గానీ కచ్చితంగా ఇది అని ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు 'పోకిరి' 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది రుజువైంది. నేడు పూరి చేసిన ఓ ట్వీట్ వీరి మధ్య అగాధానికి ఓ సాక్షంగా నిలిచింది. పోకిరి, బిజినెస్‌మెన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ సినిమాగా 'జనగణమన' అనే సినిమాని ప్రకటించాడు పూరి. అప్పట్లో దీనికి మహేష్ బాబు కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్నాని తెలిపాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. దీంతో మహేష్ - పూరీల మధ్య దూరం పెరిగింది. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో మహేష్ ని ఉద్దేశించి 'స్టోరీ నచ్చితే వెంటనే ఓకే చెప్పాలి.. లేదా నచ్చలేదని చెప్పాలి.. అంతేకానీ వారిని వెయిట్ చేపించకూడదు' అంటూ ఇండైరెక్ట్ గా మహేష్ పై కామెంట్ చేసాడు. అంతేకాకుండా 'ఇస్మార్ట్ శంకర్' టైములో ఇచ్చిన ఇంటర్వ్యూలో 'హిట్టు ల్లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని చెప్పుకొచ్చాడు. మహేష్ అభిమానులకు తన పై నమ్మకం ఉన్నప్పటికీ... మహేష్ కి లేదనీ' పూరి చెప్పాడు. 'ఇస్మార్ట్ శంకర్' విజయం సాధించింది కనుక ఇప్పుడు మహేష్ మీకు అవకాశం ఇస్తారేమో అని సదరు యాంకర్ అనగా.. 'నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా.. నేను ఓకే అనాలి కదా' అని పూరి చెప్పుకొచ్చాడు. వాస్తవానికి మహేష్ 'పోకిరి' 'బిజినెస్ మ్యాన్' చిత్రాలు ఇచ్చినప్పుడు పూరీ ప్లాపుల్లోనే ఉన్నాడు.
ఆ తర్వాత మహేష్ బాబు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం 'మహర్షి' వేడుకల్లో సుకుమార్, పూరీలను విస్మరించాడు. అంతకుముందే సుకుమార్‌తో విబేధాలు రావడం.. పూరితో కోల్డ్ వార్ నడుస్తుండటంతో కావాలనే ఇద్దరి పేర్లు చెప్పలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ సోషల్ మీడియాలో 'కిక్కిరిసిన జనం ఉండటం వల్ల వేదికపై చెప్పడం మరిచిపోయాయని' చెప్పి ఆ ఇద్దరి గురించి చెప్పాడు మహేష్. ఇప్పుడు తాజాగా పూరీ.. 'పోకిరిపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. పద్నాలుగేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతోన్నా.. పోకిరి ప్రేమికులందరికీ చీర్స్' అంటూ ట్వీట్ చేశాడు. కానీ ఇందులో మహేష్ బాబును ప్రస్థావించకుండా వదిలేశాడు. ఇలా మహేష్ బాబును ట్యాగ్ చేయకపోవడం.. 'పోకిరి లవర్స్' అంటున్నారు కనీసం 'సూపర్ స్టార్ ఫ్యాన్స్' అని కూడా అనడం లేదు.. మహేష్ బాబును ట్యాగ్ చేయండి.. బలుపు బాగా ఎక్కువ అయింది పూరికి అంటూ ఇష్టమొచ్చినట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పూరీకి కౌంటర్ అన్నట్లు 'పోకిరి' సినిమాకి నిర్మాతల్లో ఒకరైన మంజుల ట్వీట్ చేస్తూ ఎక్కడా డైరెక్టర్ పేరు మెన్షన్ చేయలేదు. దీంతో మరోసారి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టమైంది.